https://oktelugu.com/

గ్రౌండ్ రిపోర్ట్: దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్..భారీగా పోలీసులు

దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తంగా 1,98, 807 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 1,00,779 మంది కాగా పురుషులు 98,0 28 మంది ఉన్నారు. దుబ్బాకలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 315 ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు దుబ్బాకలో మరో 20 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. నోటాతో కలిపి 24 గుర్తులు కావడంతో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. మరిన్ని తెలంగాణ రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 10:41 AM IST
    Follow us on

    దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తంగా 1,98, 807 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 1,00,779 మంది కాగా పురుషులు 98,0 28 మంది ఉన్నారు. దుబ్బాకలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 315 ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు దుబ్బాకలో మరో 20 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. నోటాతో కలిపి 24 గుర్తులు కావడంతో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    కరోనా కారణంగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచిన అధికారులు మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతినిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 89 సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మరోవైపు పోలీంగ్ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి సిబ్బంది శానిటైజర్ అందిస్తున్నారు. ఆశావర్కర్లు ఓటర్లకు చేతికి గ్లౌజులు అందిస్తున్నారు. ఆపై థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్ 19 పేషెంట్లకు పీపీఈ కిట్లు అందించి ఓటు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్‌ సెంటర్లలో ఫిజికల్‌ డిస్టెన్స్‌ అమలు చేస్తున్నారు.

    Also Read: టీఆర్ఎస్ కష్టాలు.. కేటీఆర్‌కు సవాల్‌?

    ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం కాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఓటింగ్‌ తీరుపై ఆమె ఆరా తీశారు. మరోవైపు దుబ్బాక మండలం బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనిసారెడ్డి ఓటు వేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం 148 గ్రామాల్లో 315 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. దుబ్బాకలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలే కావడంతో.. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఉదయాన్నే ఓటు వేయడానికి మొగ్గుచూపుతున్నారు. 6 గంటల నుంచే క్యూలో కనిపించారు.

    సోమవారం రాత్రి టీఆర్ఎస్–-బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ… ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతోంది.  ఈసారి కరోనా నేపథ్యంలో పోలింగ్ తగ్గుతుందా అన్న సందేహాలు లేకపోలేదు. ఉదయం 9 గంటల వరకు కూడా 12.74 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్, -కాంగ్రెస్, -బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ఈ మూడు పార్టీలు కూడా ధీమాతో ఉన్నాయి. కానీ.. దుబ్బాక ఓటరు ఎవరి వైపు నిలబడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. నవంబర్ 10న ఉపఎన్నిక ఫలితాలు వెల్లడికానున్నాయి.

    Also Read: టీడీపీ తమ్ముళ్లతో వైసీపీ క్యాడర్‌‌ దోస్తానా?

    మరోవైపు.. మాక్‌ పోలింగ్‌లో బాగానే పనిచేసిన ఈవీఎంలు.. పోలింగ్‌ మొదలయ్యే సరికి మొరాయించాయి. దీంతో ఓటర్లు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పనులకు వెళ్లేది ఉండగా.. ఇక్కడ క్యూ మాత్రం కదలడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు సరిగా లేవంటూ మండిపడుతున్నారు. పనుల ఉన్నాయనే ఉదయాన్నే వచ్చి క్యూలో నిల్చున్నామని.. అయినా రెండు గంటలపైగా గడుస్తున్నా లైన్‌ కదలడం లేదని అంటున్నారు.