పేటీఎం యూజర్లకు శుభవార్త.. ఆ చార్జీల రద్దు..?

పేటీఎం యాప్ ను వినియోగించే కస్టమర్లకు ఆ కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో బ్యాంక్ నగదును బదిలీ చేసుకోవడానికి విధించిన ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు పేటీఎం ప్రకటించింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో యాప్ వినియోగదారులందరికీ ప్రయోజనం కలగనుంది. గతంలో పేటీఎం వాలెట్ లోని నగదును బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయాలంటే ఛార్జీలు వసూలు చేసేది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2020 8:12 pm
Follow us on

పేటీఎం యాప్ ను వినియోగించే కస్టమర్లకు ఆ కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో బ్యాంక్ నగదును బదిలీ చేసుకోవడానికి విధించిన ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు పేటీఎం ప్రకటించింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో యాప్ వినియోగదారులందరికీ ప్రయోజనం కలగనుంది. గతంలో పేటీఎం వాలెట్ లోని నగదును బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయాలంటే ఛార్జీలు వసూలు చేసేది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

దీంతో పేటీఎం యాప్ ను వినియోగించే కస్టమర్లు కొంత మొత్తాన్ని నష్టపోయేవారు. మరోవైపు మార్కెట్ లో పోటీ పెరుగుతుండటం, కొన్ని యాప్ లు వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్న నేపథ్యంలో పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పేటీఎం యాప్ వినియోగదారులకు మరింత చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ శేఖర్ శర్మ ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read: తక్కువ పెట్టుబడితో లాభాలిచ్చే బిజినెస్ ఇదే.. నెలకు లక్షల్లో ఆదాయం..!

ఒక యూజర్ పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ ఖాతాకు నగదును బదిలీ చేసే సమయంలో ఛార్జీలను వసూలు చేస్తోందని.. ఆ ఛార్జీలను తొలగిస్తే యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. ఈ దిశగా పేటీఎం అడుగులు వేస్తే బాగుంటుందని కోరారు. ఆ ప్రశ్నకు విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ ఇకపై పేటీఎం యూజర్లు ఆ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు.

Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?

అయితే వాలెట్ నుంచి బ్యాంక్ ఖాతాకు ఛార్జీలను తొలగించిన పేటీఎం క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎం వాలెట్ కు బదిలీ చేసే నగదుకు మాత్రం ఛార్జీలను విధిస్తూ ఉండటం గమనార్హం. గతంలో క్రెడిట్ కార్డ్ నుంచి వాలెట్ కు నగదు బదిలీ చేసినా చార్జీలు విధించని పేటీఎం కొన్ని రోజుల క్రితం క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఝలక్ ఇస్తూ ఛార్జీలు విధిస్తోంది.