‘గ్రేటర్’ ఎఫెక్ట్.. బీజేపీలోకి క్యూ కడుతున్న నేతలు..!

మొన్న దుబ్బాక.. నిన్న గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ అదరగొట్టింది. వార్ వన్ సైడ్ అవుతుందనుకున్న ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ బిగ్ ఫైట్ ఇచ్చింది. దుబ్బాకలో కారు స్పీడుకు బ్రేక్ వేసింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కారు పార్టీని ఏకంగా పంక్చర్ చేసింది. దీంతో కారు ఏటూ తేల్చుకులేక చతికిలబడింది. Also Read: టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు గ్రేటర్లో వంద సీట్లు ఈజీగా గెలుచుకుంటామని ప్రకటించిన నేతలు ఫలితాలు చూసి బిక్కమొఖం వేశారు. ఎక్స్ […]

Written By: Neelambaram, Updated On : December 6, 2020 12:21 pm
Follow us on

మొన్న దుబ్బాక.. నిన్న గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ అదరగొట్టింది. వార్ వన్ సైడ్ అవుతుందనుకున్న ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ బిగ్ ఫైట్ ఇచ్చింది. దుబ్బాకలో కారు స్పీడుకు బ్రేక్ వేసింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కారు పార్టీని ఏకంగా పంక్చర్ చేసింది. దీంతో కారు ఏటూ తేల్చుకులేక చతికిలబడింది.

Also Read: టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు

గ్రేటర్లో వంద సీట్లు ఈజీగా గెలుచుకుంటామని ప్రకటించిన నేతలు ఫలితాలు చూసి బిక్కమొఖం వేశారు. ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకున్నా మేయర్ పీఠం అందనంత దూరంలో ఉంది. దీంతో గత్యంతరలేక ఎంఐఎం మద్దతును టీఆర్ఎస్ కోరాల్సి వస్తోంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ అంటకాగితే మాత్రం రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బొక్కబొర్లా పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మారిందనే సంకేతాలు బలంగా వెళుతున్నాయి. బీజేపీ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతలకు బీజేపీ రెడ్ కార్పెట్ పరుస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి బీజేపీలో వలసలు పెరుగుతున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్న విజయశాంతి రేపు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్దిరోజులుగా రాములమ్మ కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారు. ఆమెతోపాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కాషాయ కండువా కప్పుబోతున్నట్లు సమాచారం.

Also Read: వరదల్లో కొట్టుకుపోయిన కారు.. అదే వరదలో వికసించిన కమలం

త్వరలో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో జానారెడ్డి సహా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి చంద్రశేఖర్.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. గ్రేటర్ పరిధిలోని ఓ మాజీమంత్రి.. ఓ మాజీ ఎంపీ బీజేపీలో చేరుతారనే టాక్ విన్పిస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలనే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే వీరందరినీ ఒకేసారి కాకుండా రాబోయే వరంగల్.. ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా విడుదల వారీగా చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్