కొమ్మారెడ్డి సావిత్రి.. అందుకే మహానటీమణి అయింది !

నేడు మహానటి సావిత్రి జయంతి. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన వెండితెర అద్బుతం ఆమె, కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి ఆమె, సినీ జగతిలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి కొమ్మారెడ్డి సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయిన ఒక్కే ఒక్క మహానటి సావిత్రి. Also […]

Written By: admin, Updated On : December 6, 2020 10:13 am
Follow us on


నేడు మహానటి సావిత్రి జయంతి. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన వెండితెర అద్బుతం ఆమె, కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి ఆమె, సినీ జగతిలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి కొమ్మారెడ్డి సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయిన ఒక్కే ఒక్క మహానటి సావిత్రి.

Also Read: లేడీస్ ను నిద్రపోనివ్వని మహేష్ బాబు

సావిత్రి 1937 డిశంబర్ 6న జన్మించారు. 12 ఏటనే సంసారం సినిమాతో మొదటి సారి తెరపై కన్పించి మెప్పించారు. 1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయకపోయినా.. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళభైరవి చిత్రంలో నృత్యపాత్ర చేసే అవకాశం అది. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది సావిత్రి సినీ ప్రస్థానం. కానీ ఆమె చిన్న పాత్రలనే పెద్ద పాత్రలను చేసింది ఆమె నటన. ముఖ్యంగా పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు అని చెప్పొచ్చు.

Also Read: బిగ్ బాస్: ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్

అయితే, సావిత్రిలోని అసామాన్యనటిని తెలుగుతెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు సినిమానే. అపురూపమైన ఆ దృశ్యకావ్యంలో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పార్వతి పాత్రలో సావిత్రి నటన అపూర్వం… అద్బుతం. అమాయకమైన ప్రేయసిగా సావిత్రి అభినయం, నటనా కౌశలం వర్ణించాలంటే ఏ పదాలు సరిపోవు. అంత అత్యద్భుతంగా సావిత్రి జీవించింది కాబట్టే.. ఎప్పటికీ ఆమె మహానటినే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్