టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. టీపీసీసీ చీఫ్ గా ఘోరంగా విఫలమైన ఉత్తమ్ ను తొలగించకుండా ఆయననే కొనసాగించిన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం ఎదురైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తానుగా వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఇక తనను మార్చదు అని ఆయనే వైదొలగడం విశేషం. అయితే ఇప్పుడు ఖాళీ అయిన ఆ […]

Written By: NARESH, Updated On : December 6, 2020 12:26 pm
Follow us on

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. టీపీసీసీ చీఫ్ గా ఘోరంగా విఫలమైన ఉత్తమ్ ను తొలగించకుండా ఆయననే కొనసాగించిన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం ఎదురైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తానుగా వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఇక తనను మార్చదు అని ఆయనే వైదొలగడం విశేషం. అయితే ఇప్పుడు ఖాళీ అయిన ఆ పదవి కోసం కాంగ్రెస్ లోని సీనియర్లు ప్రకటనలు చేస్తూ చిచ్చు పెడుతున్నారు. పదవి తనకంటే తనకే అంటూ అధిష్టానాన్ని ఇరుకునపెడుతున్నారు.

Also Read: బీజేపీలోకి జానారెడ్డి ప్రచారంపై ‘బండి’ ఏమన్నారంటే..!

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఓటమికి ఉత్తమ్ ఒక్కడిదే బాధ్యత కాదని.. పీసీసీలో ఉండే ప్రతి నాయకుడిది అని రేవంత్ రెడ్డిని కూడా ఓటమిలో బాధ్యుడిగా చేశారు.పీసీసీ చీఫ్ పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలుస్తానని పేర్కొన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తెస్తానని అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తరుఫున పోరాడుతామని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ ప్రజలకు భారంగా మారిందన్నారు. ఈ ఫలితాలు చూసైనా ఎల్.ఆర్.ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.వరదసాయం అందనివారికి మళ్లీ రూ.10వేల సాయం చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. వరదసాయం చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.

Also Read: వరదల్లో కొట్టుకుపోయిన కారు.. అదే వరదలో వికసించిన కమలం

మధుయాష్కీ సైతం పీసీసీ రేసుపై సై అంటున్నాడు. జానారెడ్డి పార్టీ మారడం లేదని భట్టి వివరణ ఇచ్చారు. పీసీసీపై అధిష్టానందే తుది నిర్ణయం అన్నారు.

ఇప్పటికే అందరికంటే ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేత కావడంతో.. స్వతహాగా కాంగ్రెస్ వాదులకే ఆ పీఠం ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ సీనియర్లలో వ్యక్తమవుతోంది. వారే దీన్ని అడ్డుకుంటున్నారు.

కాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్ మొదలుపెట్టారు. కోమటిరెడ్డి , జగ్గారెడ్డి వ్యాఖ్యలతో అది మరింత హీట్ పెరిగింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్