తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ కు అనుకోని సమస్యలు వచ్చిపడుతున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ.. వ్యసాయేతేర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొద్దిరోజులుగా ప్రభుత్వం చేపడుతోంది.
Also Read: ఉద్యోగాల భర్తీలో స్పీడు పెంచిన తెలంగాణసర్కార్.. ఖాళీలు ఎన్నంటే?
అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ వివరాలను ప్రభుత్వం సేకరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు ఆధార్ వివరాలు.. కులం.. వ్యక్తిగత వివరాలను సేకరించొద్దని ఆదేశాలను జారీ చేసింది.
హైకోర్టు తీర్పును పాటిస్తామని చెప్పిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పాత పద్ధతిలోనే చేస్తుండటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగిస్తే కోర్టు ధిక్కార కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ వ్యవహరంపై సీఎస్ అఫిడివిట్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధమైంది.
Also Read: వైరల్ వీడియో: ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్
ఈక్రమంలోనే తాజాగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండగా.. హైకోర్ట్ తీర్పు వల్ల కొత్త స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా నేడు రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎస్.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లాలా? లేదా అని తేల్చనున్నారని సమాచారం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్