https://oktelugu.com/

కేసీఆర్ పై కోపం.. కానీ ఏం చేయలేకపోతున్నారు!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆ వర్గంలో పీకలదాకా కోపం ఉంది.. కానీ వారు ఏం చేయలేకపోతున్నారు. సగం జీతం ఇచ్చినా ముక్కు ములిగి తీసుకున్నారు తప్పితే ధైర్యంగా అడగలేని పరిస్థితి. ఇక పక్కరాష్ట్రంలో తమ స్కేలు వారికి తమకంటే డబుల్ జీతం వస్తున్నా.. నిస్సహాయంగా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు పీఆర్సీ చిచ్చు పీక్స్ లో నడుస్తోందన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఢీకొట్టలేక.. అలాగని ఊరుకొంటుంటే.. జీతాలు నష్టపోతూ తెలంగాణ ఉద్యోగ, […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2020 11:36 am
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆ వర్గంలో పీకలదాకా కోపం ఉంది.. కానీ వారు ఏం చేయలేకపోతున్నారు. సగం జీతం ఇచ్చినా ముక్కు ములిగి తీసుకున్నారు తప్పితే ధైర్యంగా అడగలేని పరిస్థితి. ఇక పక్కరాష్ట్రంలో తమ స్కేలు వారికి తమకంటే డబుల్ జీతం వస్తున్నా.. నిస్సహాయంగా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు పీఆర్సీ చిచ్చు పీక్స్ లో నడుస్తోందన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఢీకొట్టలేక.. అలాగని ఊరుకొంటుంటే.. జీతాలు నష్టపోతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

    Also Read: రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?

    తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ఫైట్ చేశారు ఉద్యోగ, ఉపాధ్యాయులు.. నిరుద్యోగులు. కానీ తెలంగాణ వచ్చాక వీరికి అస్సలు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీలు, డీఏలు , టీఏలు సరిగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారంతా తీవ్రంగా నష్టపోతున్నారు.

    పక్కనున్న ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీతోపాటు టీఏ, డీఏలను పెంచగా వారి జీతాలు భారీగా పెరిగాయి. ఏపీలో 70వేల పైచిలుకు తీసుకుంటున్న ఉద్యోగికి.. అదే క్యాడర్ లో తెలంగాణలో 50వేలు మాత్రమే తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.

    తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆరే సుప్రీం. ఆయనను ఎదురించి సమ్మెకెళ్లిన ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితిని కళ్లారా చూశాం. పైగా ఉద్యోగులను సంఘాలుగా విభజించి కేసీఆర్ చాలా మందిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. దీంతో ఎవరూ పోరాటానికి రాని పరిస్థితి నెలకొంది.

    Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

    అందుకే పక్కరాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకు.. తెలంగాణ ఉద్యోగుల జీతాలకు షాన్ దాన్ ఫరఖ్ ఉందని.. కేసీఆర్ చేయబట్టి తాము నష్టపోయామన్న బాధ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఉంది. కేసీఆర్ ను ఓడగొట్టాలని వారంతా పట్టుదలతో ఉన్నారు. కానీ వీరి సంఖ్యా బలం తక్కువ. తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతులు, గ్రామీణులను గుప్పిట పట్టిన కేసీఆర్.. అసలు ఓటు బ్యాంకు కానీ ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో శీతకన్ను వేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.