https://oktelugu.com/

ఓటుకు నోటు కేసు: ఎమ్మెల్యే సండ్రకు కోర్టులో గట్టి షాక్

ఏసీబీ కేసు వదిలేలా లేదు. ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మెడకు చుట్టుకునేలానే కనిపిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టులో సండ్రకు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో బిగ్ షాట్స్ ఏసీబీ చేతికి చిక్కారు.. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ లాంటి వారు అరెస్ట్ కాగా.. ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరిన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 08:33 PM IST
    Follow us on

    ఏసీబీ కేసు వదిలేలా లేదు. ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మెడకు చుట్టుకునేలానే కనిపిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టులో సండ్రకు గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో బిగ్ షాట్స్ ఏసీబీ చేతికి చిక్కారు.. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ లాంటి వారు అరెస్ట్ కాగా.. ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సండ్ర వెంకటవీరయ్య పిటీషన్ తోపాటు ఉదయ సింహ వేసిన డిశ్చార్జి పిటీషన్ ను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను ఏసీబీ కోర్టు
    తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ఈనెల 4కి కోర్టు వాయిదా వేసింది.

    Also Read: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.! హెచ్చరించిన బీజేపీ

    ఇటీవలే విచారణ సందర్భంగా సండ్ర, ఉదయసింహ వేసిన పిటీషన్లపై ఏసీబీ స్పెషల్ పీపీ వాదించారు. ఓటుకు నోటు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. వారి పిటీషన్లను కొట్టివేయాలని కోర్టును కోరారు. ఈ కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

    Also Read: నెల్లూరులో పది మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్సింగ్.. చివరకు..?

    రేవంత్ రెడ్డితో కలిసి వీరంతా కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు.శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఓటుకు నోటు కుట్రపై రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని.. ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్ లోనూ సండ్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నదని ఏసీబీ పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది. దీంతో ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను తోసిపుచ్చుతూ ఆయనకు గట్టి షాకిచ్చింది.