https://oktelugu.com/

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు పూర్తిగా మాఫీ..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోం లోన్ తీసుకోవాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ లోన్ ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఆఫర్ పరిమిత కాలం మాత్రమే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2020 / 06:04 PM IST
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోం లోన్ తీసుకోవాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

    ఎస్బీఐ లోన్ ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండటంతో ఎస్బీఐ ఖాతాదారులు రుణాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐలో లోన్ తీసుకునే వాళ్లు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే ఎస్బీఐ రుణాలను అందిస్తుండగా 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నాయి.

    లక్ష రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు హోమ్ లోన్లు తీసుకునే కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ తో ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్లకు అదనపు ప్రయోజనాలను సైతం కల్పిస్తూ ఉండటం గమనార్హం.

    అయితే ఎస్బీఐ అదనపు ప్రయోజనాలను అందరికీ కాకుండా కొందరికి మాత్రమే కల్పిస్తోంది. సిబిల్ స్కోర్ ను ఆధారంగా చేసుకొని ఎస్బీఐ అదనపు ప్రయోజనాలను కల్పించనుందని తెలుస్తోంది. అయితే 30 లక్షల రూపాయల లోపు రుణాలకు 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతుండగా 30 లక్షలకు పై బడిన రుణాలకు మాత్రం వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. ఎస్బీఐ అందుబాటులోకి తెస్తున్న కొత్త ఆఫర్ల పట్ల ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.