హోస్ట్ గా ఒకప్పటి హాట్ హీరోయిన్.. !

హాట్ హీరోయిన్ సమీరా రెడ్డి.. ఈ పేరుకి ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది సమీరా రెడ్డి. దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని.. అటు నుండి బాలీవుడ్ పోయి, అక్కడా తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులకు కనువిందు చేసి.. మొత్తానికి నేషనల్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక తెలుగులో చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, సూర్యతో ‘సూర్య […]

Written By: Neelambaram, Updated On : November 16, 2020 6:26 pm
Follow us on


హాట్ హీరోయిన్ సమీరా రెడ్డి.. ఈ పేరుకి ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది సమీరా రెడ్డి. దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని.. అటు నుండి బాలీవుడ్ పోయి, అక్కడా తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులకు కనువిందు చేసి.. మొత్తానికి నేషనల్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక తెలుగులో చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలు చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ సమీరా రెడ్డి కాంబినేషన్ కి ఓ రేంజ్ లో హైప్ ఉండేది.

Also Read: ఎట్టకేలకు మెగాస్టార్ రెడీ.. 20 నుండి మొదలు !

అలాంటి సమీరా రెడ్డి ప్రస్తుతం హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తూ.. కాలాన్ని నెట్టుకొస్తోంది. పెళ్ళయ్యాక పూర్తిగా సినిమాలను దూరం పెట్టేసింది. ఆ మధ్య పలు ఆఫర్లు వచ్చినా నో చెప్పేసింది. అయితే ఆమె సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రావడం… తమిళంలో ఆర్య, విశాల్ కలిసి చేయనున్న కొత్త చిత్రంలో సమీరా రెడ్డి ముఖ్యమైన లేడీ విలన్ పాత్రను చేస్తుందనే వార్త బాగా వైరల్ అవ్వడంతో.. ఈ వార్త పై సమీరా రెడ్డి స్పందించి ఈ సినిమా చేయట్లేదని.. తనకు సినిమాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశ్యం లేదని, తన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కావడంతో వారికి తన అవసరం ఎంతో ఉందని, అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాల్లో మళ్లీ యాక్ట్ చెయ్యను అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Also Read: కమల్ హాసన్ ఓ గుడ్డివాడిగా.. !

అయితే పై స్టేట్మెంట్ ఇచ్చిందో లేదో వెంటనే.. మొత్తానికి సమీరా రెడ్డి కొత్త అవతారం ఎత్తబోతునట్లు తెలుస్తోంది. ఓ హిందీ ఛానెల్ కోసం త్వరలోనే సమీరా రెడ్డి హోస్ట్ గా చేయబోతుందట. ఇంతకీ సమీరా రెడ్డి హోస్ట్ గా చేస్తోంది ఎలాంటి షోకి అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు గాని, బట్ ఆమె హోస్ట్ గా చేయడం మాత్రం ఖాయం అని సమాచారం. మరి చూడాలి సమీరా రెడ్డి ఎలాంటి షోతో రీఎంట్రీ ఇస్తోందో. అలాగే తెలుగులో కూడా ఆమె భవిష్యత్తులో హోస్ట్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్