https://oktelugu.com/

బాలయ్య బాబుకు విలన్ అతనే !

నందమూరి బాలకృష్ణకి విలన్ గా డా రాజశేఖర్ నటించబోతున్నాడా..? నట సింహంకి పోటీగా డైలాగ్ లు చెప్పాలంటే.. అది జగపతిబాబు లాంటి లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలి. కానీ, జగపతిబాబు అయితే బోర్… ఇప్పటికే లెజెండ్ లో చూసేసాం. పోనీ బాలీవుడ్ సంజయ్ దత్ ను అడుగుదాం అంటే.. బడ్జెట్ సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య టీంకి దొరికిన గొప్ప ఆప్షన్.. డా రాజశేఖర్. అందుకే ఆయనే బాలయ్యకు విలన్. బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి […]

Written By: , Updated On : November 15, 2020 / 06:26 PM IST
Follow us on

Balakrishna
నందమూరి బాలకృష్ణకి విలన్ గా డా రాజశేఖర్ నటించబోతున్నాడా..? నట సింహంకి పోటీగా డైలాగ్ లు చెప్పాలంటే.. అది జగపతిబాబు లాంటి లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలి. కానీ, జగపతిబాబు అయితే బోర్… ఇప్పటికే లెజెండ్ లో చూసేసాం. పోనీ బాలీవుడ్ సంజయ్ దత్ ను అడుగుదాం అంటే.. బడ్జెట్ సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య టీంకి దొరికిన గొప్ప ఆప్షన్.. డా రాజశేఖర్. అందుకే ఆయనే బాలయ్యకు విలన్. బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనే సీనియర్ బాలయ్యకు ఓ విలన్ పాత్ర ఉందట. ఈ పాత్రలో మొదట సంజయ్ దత్ ను తీసుకోవాలని మొదట భావించారు.

Also Read: మెగాస్టార్ ‘వేదాళం’ మాటలు మొదలు !

అయితే కొన్ని కారణాల వల్ల అది కుదిరేలా లేదు. దాంతో రాజశేఖర్ దగ్గరకు వచ్చింది ఆఫర్. రీసెంట్ గా కరోనా నుండి కోలుకుని మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తోన్న రాజశేఖర్ కి ఇది మంచి ఆప్షనే. అందుకే రాజశేఖర్ కూడా ఓకే చెప్పాడట. డిసెంబర్ అనంతరం షూట్ లో పాల్గొంటాను అని క్లారిటీ ఇచ్చాడట. ఈ క్రమంలో బాలయ్య బాబుకు కూడా ఫోన్ చేసి.. చెప్పాడట. అసలుకే బాలయ్య బాబు మనసు బహు సుకుమారం కదా.. రాజశేఖర్ చెప్పడం ఆలస్యం.. వెంటనే బోయపాటి శ్రీనుకి ఆర్డర్ వెళ్ళింది.. సినిమాలో రాజశేఖర్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉండాలని.. మొత్తానికి బాలయ్య బాబుకు విలన్ గా రాజశేఖర్ ఫిక్స్ అయ్యాడు అన్నమాట.

Also Read: తరుణ్ తో వ్యవహారం బయటపెట్టిన హీరోయిన్ !

ఆయితే బోయపాటి సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి ఒక సీన్ లో భారీ ఫైట్ రాసుకున్నాడట. ఇప్పుడు ఆ ఫైట్ ను రాజశేఖర్ – బాలయ్య మధ్యలో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాడు. ఈ ఫైట్ బాగా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకున్నాడట బోయపాటి. మరి ఈ వయసులో ఈ ఇద్దరూ సీనియర్ హీరోలు ఏ రేంజ్ లో ఫైట్ చేసి తమ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. ఇక బాలయ్య ముదురు పాత్రకు హీరోయిన్ విషయాన్ని పక్కన పెడితే.. బాలయ్య యంగ్ క్యారెక్టర్ కి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. కొత్త హీరోయిన్ ను చూసినా.. ఆమె సెట్ అవ్వట్లేదని టాక్. ఏమైనా బాలయ్యకి హీరోయిన్ సమస్య ప్రతి సినిమాకి ఒక ఆనవాయితీగా మారింది. నిజానికి ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అడిగినా.. బాలయ్య అనేసరికి అందరూ వెనకడుగు వేస్తున్నారట పాపం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్