https://oktelugu.com/

భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఏకంగా రూ.1200 పతనం…?

భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా పతనమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర నాలుగు నెలల కనిష్టానికి చేరింది. ఏకంగా 1200 రూపాయలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 49,000 రూపాయల దిగువకు వచ్చింది. మరో నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. Also Read:‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2020 / 08:16 PM IST
    Follow us on

    భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా పతనమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర నాలుగు నెలల కనిష్టానికి చేరింది. ఏకంగా 1200 రూపాయలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 49,000 రూపాయల దిగువకు వచ్చింది. మరో నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో బంగారం ధర క్రమంగా తగ్గుతోంది.

    Also Read:‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?

    వ్యాక్సిన్లకు సంబంధించిన వార్తలు వస్తుండటంతో పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. మోడర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ కంపెనీలు త్వరలో కరోనా వ్యాక్సిన్లను విడుదల చేయనున్నట్టు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. బంగారం ధర తగ్గడంతో మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం పసిడి విక్రయాలు పుంజుకున్నాయని తెలుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం ధర రూ.49,051 రూపాయలుగా ఉంది.

    Also Read:బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌‌ అతనేనా..?

    వెండి ధర 550 రూపాయలు తగ్గగా మర్కెట్ లో 59,980 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర గత సెషన్ లో ఏకంగా 1,628 రూపాయలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నా పసిడికి డిమాండ్ పెరగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో సైతం బంగారం ధర తగ్గింది. న్యూయార్క్ కామెక్స్ లో ఒక శాతం నష్టంతో 1,826 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

    మరిన్ని వార్తల కోసం: అంతర్జాతీయం

    ప్రస్తుతం బంగారంపై ప్రతికూల ప్రభావం పడటంతో బంగారం ధర తగ్గినా భవిష్యత్తులో మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొనుగోలుదారులకు ఇదే సరైన సమయమని బంగారం విక్రయించాలని అనుకుంటే మాత్రం కొంతకాలం ఆగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.