https://oktelugu.com/

బ్యాలెట్ పేపర్.. ఈవీఎంలకు కాలం చెల్లిందా?

నేడు గ్రేటర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా డివిజన్లలో పోలింగ్ మందకోడిగా సాగింది. ఒకటి అరమినహా మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం 30శాతానికి తక్కువగానే నమోదు కావడం గమనార్హం. సాయంత్రం 5గంటల వరకు కూడా 35శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్లు సమాచారం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఈసారి 50శాతానికి పైగా ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 08:23 PM IST
    Follow us on

    నేడు గ్రేటర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా డివిజన్లలో పోలింగ్ మందకోడిగా సాగింది. ఒకటి అరమినహా మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం 30శాతానికి తక్కువగానే నమోదు కావడం గమనార్హం. సాయంత్రం 5గంటల వరకు కూడా 35శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్లు సమాచారం.

    2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఈసారి 50శాతానికి పైగా ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టారు. తీరా ఎన్నికల రోజు వచ్చేనాటికి మాత్రం నగరవాసులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

    ఈసారి ఓటింగ్ శాతం తగ్గడానికి నగరవాసుల నిర్లక్ష్యమే ప్రధానంగా కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. హైదరాబాద్లో లాక్డౌన్ ఎత్తేయడంతో నగరంలోని వలస కార్మికులు ఇంటిముఖం పట్టడం ఒక కారణంగా కన్పిస్తోంది. వరుసగా సెలవులు రావడంతో ఉద్యోగులంతా సొంతూళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది.

    ఇక నగరంలో ఎక్కువగా ఉండే సాఫ్ట్ వేర్(టెక్కీలు) ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 80శాతం మంది టెక్కీలు జీహెచ్ఎంసీ ఎన్నికలు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రభావం ఓటింగ్ శాతంపై భారీగానే పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహాణ ప్రక్రియపై పలురకాల చర్చలు జరుగుతున్నాయి.

    బ్యాలెట్.. ఈవీఎంలకు బదులుగా ఆన్ లైన్ ఓటింగ్ అమలు చేస్తే యువత పెద్దసంఖ్యలో ఓటింగ్ పాల్గొంటారనే వాదన తెరపైకి వచ్చింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత కంటే వృద్ధులు.. వికలాంగులు.. మహిళలే ఎక్కువగా ఓటింగులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో యువత పాల్గొనాలంటే ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియను తీసుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.