ఎస్బీఐ బంపర్ ఆఫర్… ఈఎంఐ కట్టకుండా రూ. 5 లక్షల రుణం..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో ఖాతాదారులకు వరుస శుభవార్తలు చెబుతూ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ ఖాతాదారుల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ రుణాలలో ఒకటైన ఎమర్జెన్సీ పర్సనల్ లోన్స్ ద్వారా తక్కువ వడ్డీకే ఖాతాదారులకు రుణాలను అందిస్తోంది. కేవలం 45 నిమిషాల్లో యోనో యాప్ ద్వారా ఈ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: విజయవాడపై కొత్త […]

Written By: Kusuma Aggunna, Updated On : November 2, 2020 10:45 am
Follow us on


దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో ఖాతాదారులకు వరుస శుభవార్తలు చెబుతూ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ ఖాతాదారుల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ రుణాలలో ఒకటైన ఎమర్జెన్సీ పర్సనల్ లోన్స్ ద్వారా తక్కువ వడ్డీకే ఖాతాదారులకు రుణాలను అందిస్తోంది. కేవలం 45 నిమిషాల్లో యోనో యాప్ ద్వారా ఈ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: విజయవాడపై కొత్త ప్రతిపాదన ఇదీ

ఈ రుణాలు తీసుకున్న ఖాతాదారులు 10.5 శాతం వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇతరు రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీరేట్లతో పోల్చి చూస్తే ఈ వడ్డీరేటు తక్కువ మొత్తమే అని చెప్పుకోవాలి. ఎస్బీఐ సాధారణ ఖాతాదారులకు 2 లక్షల రూపాయల వరకు, పెన్షన్ తీసుకునే వారికి రెండున్నర లక్షల వరకు, సర్వీస్ క్లాస్ ఖాతాదారులకు రూ. 5 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది.

కరోనా మహమ్మారి ఉధృతి, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని లోన్ తీసుకున్న రోజు నుంచి ఆరు నెలల పాటు ఈ రుణానికి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో 40 కోట్లకు పైగా ఖాతారులను కలిగిన ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు సులభంగా రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. రేపటినుంచే తెలంగాణకు బస్సులు..?

ఎస్బీఐ ఖాతాదారులు యోనో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రిఅప్రూవ్డ్ లోన్స్ సెక్షన్‌లో ఈ రుణం పొందడానికి అర్హులో కాదో సులభంగా తెలుసుకోవచ్చు. లేద పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ లోని చివరి నాలుగు నంబర్లు టైప్ చేసి 567676 నంబర్ కు మెసేజ్ చేసినా ఈ రుణాలకు అర్హులో కాదో సులభంగా తెలుస్తుంది. ఎస్బీఐ గత కొన్ని నెలల నుంచి కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం.