కొత్త ఏడాదిలో కేటీఆర్ కు పట్టాభిషేకం?

కొత్త ఏడాదిలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ హవా రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ లో సీఎం.. మంత్రులపై మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. Also Read: ‘క్రెడిట్’ వద్దు.. కాలేజీ చాలంటున్న జగ్గారెడ్డి..! టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కేటీఆరే కాబోయే సీఎం అంటూ టీఆర్ఎస్ లో ప్రచారం జరిగింది. పలువురు మంత్రులు సైతం కేటీఆర్ కు త్వరలోనే పట్టాభిషేకం […]

Written By: Neelambaram, Updated On : December 31, 2020 8:14 pm
Follow us on

కొత్త ఏడాదిలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ హవా రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ లో సీఎం.. మంత్రులపై మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: ‘క్రెడిట్’ వద్దు.. కాలేజీ చాలంటున్న జగ్గారెడ్డి..!

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కేటీఆరే కాబోయే సీఎం అంటూ టీఆర్ఎస్ లో ప్రచారం జరిగింది. పలువురు మంత్రులు సైతం కేటీఆర్ కు త్వరలోనే పట్టాభిషేకం జరుగబోతుందంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ సైతం కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

టీఆర్ఎస్ రెండోసారి అధికారికంలోకి వచ్చిన తొలినాళ్లలో కేటీఆర్ ను సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. దీంతో కేటీఆర్ సైతం పార్టీని తన గ్రిప్ లోకి తీసుకొచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని జిల్లాలు తిరుగుతూ పార్టీలో తిరుగులేని నేతగా మారిపోయారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పై పూర్తి వ్యతిరేక రాకముందే కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట.  దీంతో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగా కేటీఆర్ ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం భేటి.. కీలక అంశాలివే..!

కేటీఆర్ సీఎం అయ్యాక కేసీఆర్ ఢిల్లీలో రాజకీయాలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్.. బీజేపీయేతర పార్టీలను ఏకంగా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.

ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను సైతం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లీ తీసుకొచ్చారు. హరీష్ రావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనున్నారట. కేటీఆర్ ఇప్పటికే అన్ అఫిషియల్ గా సీఎంగా కొనసాగుతున్నారనే టాక్ టీఆర్ఎస్ లో ఉంది. ఈక్రమంలోనే కేటీఆర్ కు ఫిబ్రవరిలో పట్టాభిషేకం జరుగబోతుందనే లీకులు టీఆర్ఎస్ నుంచి లీకులు విన్పిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్