https://oktelugu.com/

బంగారం పోగొట్టుకున్నారా.. ఇలా చేస్తే మీ డబ్బులు వెనక్కి..?

దేశంలో బంగారం కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 5,000కు అటూఇటుగా ఉండగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ పలుకుతోంది. అయితే ఇంత విలువ చేసే బంగారం ఏదైనా కారణాల వల్ల పోగొట్టుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అందువల్ల బంగారం కొనుగోలు చేసే వాళ్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది. ఎవరైతే బంగారం కొనుగోలు చేసి ఇన్సూరెన్స్ చేయించుకోరో వాళ్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2020 / 08:55 AM IST
    Follow us on


    దేశంలో బంగారం కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 5,000కు అటూఇటుగా ఉండగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ పలుకుతోంది. అయితే ఇంత విలువ చేసే బంగారం ఏదైనా కారణాల వల్ల పోగొట్టుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అందువల్ల బంగారం కొనుగోలు చేసే వాళ్లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది.

    ఎవరైతే బంగారం కొనుగోలు చేసి ఇన్సూరెన్స్ చేయించుకోరో వాళ్లు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దొంగతనం జరిగినా లేదా బంగారం పోగొట్టుకున్నా ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే బాధ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ జువెలరీ సంస్థలు అన్నీ బంగారం కొనుగోలు చేసే కస్టమర్లకు ఇన్సూరెన్స్ కవరేజీ సేవలను అందిస్తున్నాయి. బంగారానికి ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.

    కొందరు బంగారం ఇంట్లో పెడితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని బ్యాంకు లాకర్లలో బంగారం దాచుకుంటూ ఉంటారు. బంగారానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ప్రకృతి వైపరిత్యాలు, వరదల సమయంలో బంగారం పోయినా ఇన్సూరెన్స్ వల్ల డబ్బులు వెనక్కు వస్తాయి. బంగారం కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే బంగారానికి ఇన్సూరెన్స్ సౌకర్యం చేయించుకుంటే మంచిది.

    అయితే ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో నియమనిబంధనలను స్పష్టంగా తెలుసుకుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మనం కొనుగోలు చేసిన బంగారం విలువను బట్టి బంగారంకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మన తప్పు, పొరపాటు వల్ల బంగారం పోతే మాత్రం ఇన్సూరెన్స్ ను పొందలేము.