https://oktelugu.com/

ప్రజలకు భారీ లాభాలను ఇచ్చే 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే..?

దేశంలో చాలామంది చేతిలోని డబ్బులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా భారీ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుందిని ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 29, 2021 / 09:54 PM IST
    Follow us on

    దేశంలో చాలామంది చేతిలోని డబ్బులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా భారీ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే అవకాశం ఉంటుందిని ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

    అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు వచ్చే అవకాశాలు ఉండటంతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. అందువల్ల అవగాహన ఉంటే మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో మంచి రాబడిని అందిస్తున్నాయి. వ్యాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఫండ్స్ 50 శాతానికి పైగా రాబడిని అందించాయి.

    ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్, ఎస్‌బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్, యూటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ కూడా 50 శాతానికి పైగా రాబడిని అందించడం గమనార్హం. నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఏడాదిలోనే 76 శాతం రాబడిని అందించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్ 74 శాతం రాబడిని అందించింది.

    ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 71 శాతం, యూటీఐ బ్యాంకింగ్ ఫండ్ 66 శాతం, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ 67 శాతం, ఎస్‌బీఐ నిఫ్టీ బ్యాంక్ మంచి రాబడిని అందించాయనే సంగతి తెలిసిందే.