
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు ఏకంగా 33 సార్లు పెంచడం గమనార్హం. ఈరోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరగగా డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో లీటర్ పెట్రోల్ ను కేవలం ఒక రూపాయికే పొందవచ్చు. అయితే రూపాయికే పెట్రోల్ పొందాలంటే ఒక షరతు ఉంది.
ఎవరైతే వందేమాతరం చెబుతారో వారు మాత్రమే రూపాయికే పెట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. గుజరాత్‌లోని వడోదరలో లీటర్ పెట్రోల్ బంక్ లో ఈ ఆఫర్ ఉంది. టీం రివల్యూషన్ అనే సంస్థ రూపాయికే లీటర్ పెట్రోల్ ను పంపిణీ చేస్తోంది. పెరుగుతున్న ధరను, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ మొత్తం 300 లీటర్ల పెట్రోల్ ను పంపిణీ చేయడానికి సిద్ధమైంది.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్‌ను లీటరుకు రూ.1 చొప్పున పంపిణీ చేస్తుండటం గమనార్హం. రాజకీయ పార్టీల కార్మికులకు, సాధారణ ప్రజలకు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంస్థ అధిపతి స్వెజల్ వ్యాస్ వెల్లడించారు. టీం రివల్యూషన్ అనే సంస్థ మోదీ ప్రభుత్వం త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందని భావిస్తోంది.
రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయో తగ్గుతాయో చూడాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే మాత్రం సాధారణ, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.