దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చాలామంది జ్వరం, తలనొప్పి, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడి వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంతమంది తెగ టెన్షన్ పడుతున్నారు. మరి కొందరు వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. అయితే నిపుణులు మాత్రం వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం రావడం సాధారణంగా జరుగుతుందని చెబుతున్నారు.
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పునరుత్తేజివం అవుతోందని ఈ లక్షణాల ద్వారా తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని శరీరంలొ సహజ వ్యవస్థ, సముపార్జిత వ్యవస్థ ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలోకి ఏదైనా ప్రవేశిస్తే సహజ వ్యవస్థ ప్రతి చర్య ప్రారంభిస్తుందని కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తెల్ల రక్తకణాలు ప్రక్రియ ప్రారంభించడం వల్ల జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. యువతలో ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే వృద్ధుల్లో తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్లే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫస్ట్ డోస్ తీసుకున్న సమయంలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని సెకండ్ డోస్ తీసుకున్న సమయంలో కనిపించవని వైద్య నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అలర్జీ రావడం అరుదుగా జరుగుతుందని వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు అపోహలను వీడి వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని నిపుణులు సూచనలు చేస్తున్నారు.