మన దేశానికి చెందిన ప్రజలు జూన్ నెల 30వ తేదీలోగా కొన్ని పనులను కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు, పాన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు జూన్ నెల చివరి లోపు కొన్ని అంశాలను కచ్చితంగా పూర్తి చేయాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పనులు పూర్తి చేయడం సాధ్యం కాకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి జూన్ నెల 30వ తేదీ చివరి తేదీగా ఉంది.
ఇప్పటికే కేంద్రం పలుమార్లు పాన్ ఆధార్ కార్డ్ లింక్ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం గడువును పొడిగించకపోతే మాత్రం ఇప్పటివరకు పాన్ కార్డును ఆధార్ కార్డ్ తో లింక్ చేయని వాళ్ల పాన్ కార్డ్ చెల్లకపోయే అవకాశం ఉంది. లింక్ చేయని పాన్ కార్డును వినియోగించినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ తరువాత పెనాల్టీ చెల్లించి మరీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ను లింక్ చేసుకోవాల్సి వస్తుంది.
మరోవైపు సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకులు కొన్ని స్పెషల్ స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ నెలాఖరు వరకే ఆ స్కీమ్స్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లకు సిండికేట్ బ్యాంక్ కెనరాలో విలీనం అయింది కాబట్టి జూలై 1 నుంచి వాళ్ల పాత బ్యాంక్ ఖాతాల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు పని చేయవు.
సిండికేట్ బ్యాంక్ కు సంబంధించిన చెక్ బుక్స్ కూడా చెల్లుబాటు కావు. అందువల్ల మీరు సిండికేట్ బ్యాంక్ కస్టమర్ అయితే వెంటనే చెక్ బుక్ మార్చుకుని కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తో లావాదేవీలు జరిపితే మంచిది.