పడుతూ ఉంటారు. అయితే ఇకపై మొబైల్ ఫోన్లు వాడే యూజర్లకు ఓటీపీ కష్టాలు తీరే విధంగా టెలీకాం కంపెనీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ టెలీకాం సంస్థలు ప్రస్తుతం ఈ పని మీదే నిమగ్నమయ్యాయి.
టెలీకాం సంస్థలు మొనైల్ ఫోన్లను వాడేవాళ్లకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలన్నా, పోటీ పరీక్షలు, గుర్తింపు కార్డులు దరఖాస్తు చేయాలన్నా, డౌన్ లోడ్ చేసుకోవాలన్నా ఓటీపీ తప్పనిసరి. ఓటీపీ లేకపోవడం వల్ల ఎంతోమంది చేయాల్సిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో టైమ్ అయిపోయిన తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తోంది.
వన్ టైమ్ పాస్ వర్డ్ లేకపోతే ఇబ్బంది పడకుండా మొబైల్ నంబర్ సహాయంతో యూజర్ ఐడెంటిటీని గుర్తించవచ్చు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ సర్వీసులు యూజర్లకు అందుబాటులోకి రావచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. రోజురోజుకు ఓటీపీ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలీకాం కంపెనీలు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
కంపెనీలు సరికొత్త సాఫ్ట్ వేర్ సహాయంతో యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ తరహా సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఓటీపీ లేకపోయినా మోసాలు జరగకుండా ఉండే విధంగా టెక్నాలజీ కంపెనీలు ముందడుగులు వేయనున్నాయి.