https://oktelugu.com/

జాలు వారిన ‘వెన్నెల’కంటి కలం ఆగిపోయింది!

తెలుగు చలన చిత్ర సీమలో ధృవతారలు రాలిపోతున్నారు. మొన్న బాలసుబ్రహ్మణ్యం.. నేడు ప్రముఖ గీత రచయిత వెన్నలకంటి (63) కన్నుమూయడం విషాదం నింపింది. వెన్నెలకంటి ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read: ట్రైలర్ టాక్: ‘అల్లుడు అదర్స్’ అన్నీ కలగలిపేశాడే? తెలుగు చిత్ర సీమలో ఎన్నో గొప్ప గొప్ప పాటలకు పురుడు పోసిన వెన్నెల కంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. […]

Written By: , Updated On : January 5, 2021 / 07:34 PM IST
Follow us on

Vennalakanti died

తెలుగు చలన చిత్ర సీమలో ధృవతారలు రాలిపోతున్నారు. మొన్న బాలసుబ్రహ్మణ్యం.. నేడు ప్రముఖ గీత రచయిత వెన్నలకంటి (63) కన్నుమూయడం విషాదం నింపింది. వెన్నెలకంటి ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: ట్రైలర్ టాక్: ‘అల్లుడు అదర్స్’ అన్నీ కలగలిపేశాడే?

తెలుగు చిత్ర సీమలో ఎన్నో గొప్ప గొప్ప పాటలకు పురుడు పోసిన వెన్నెల కంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. 1957లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తి చేశారు.

ఇక ఎస్.బీ.ఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన వెన్నెలకంటికి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. అదే ఆయనను గీత రచయితను చేసింది. తన 11వ ఏటే ‘భక్త దు:ఖనాశ పార్వతీశా’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. ఇక విద్యార్థి దశలో ‘రామచంద్ర శతకం’.. లలిత శతకం కూడా రచించారు.

మానవతా నాటకాలు.. సినిమాల మీదే ఉండడంతో అప్పుడప్పుడూ నాటకాలు కూడా వేసేవారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా? అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయనను సినీ గేయ రచయితగా నిలబెట్టింది.

Also Read: ఆ వరం టాలీవుడ్‌కి ఎప్పుడో..

వెన్నెలకంటి సినిమాలపై మక్కువ కావడంతో నెల్లూరులో పుట్టిన ఆయన చెన్నై పక్కనే కావడంతో అక్కడికి అవకాశాల కోసం వెళ్లి వస్తుండేవాడు. వెన్నెలకంటికి 1986లో నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి తొలి చాన్స్ ఇచ్చారు. వెన్నెలకంటి ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘చిన్ని చిన్నికన్నయ్యకు వెన్నెల జోల’ తన తొలి పాట రాశాడు. సినిమాల్లో అవకాశాలు పెరగడంతో ఎస్.బీ.ఐలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం మొదలుపెట్టారు.

1988లో వెన్నెల కంటి రాసిన మహర్షి సినిమాలోని ‘మాటరాని మౌనమిది’ పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్. యూత్ ను ఊపేసింది. అలా మొదలైన పాటల ప్రవాహం.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్