భారతదేశంలో 2021 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు రానుండగా గ్రహణం రోజుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 గ్రహణాల్లో రెండు చంద్ర గ్రహణాలు కాగా మిగిలిన రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి. అయితే మన దేశంలోని ప్రజలకు నాలుగు గ్రహణాలలో రెండు గ్రహణాలు కనిపిస్తాయి. మిగిలిన రెండు గ్రహణాలు మన దేశంలో కనిపించవు కాబట్టి వాటి ప్రభావం మనపై ఎక్కువగా ఉండదు.
Also Read: రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
ఈ సంవత్సరంలో మే నెల 26వ తేదీన చంద్ర గ్రహణం రానుంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో గ్రహణం రోజున చంద్రుడు మొదట కనిపిస్తాడు. సిక్కిం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మే 26వ తేదీన 101 శాతం భూమి కప్పివేస్తుందని తెలుస్తోంది.
Also Read: ఆడపిల్ల పుట్టిందని ఫ్రీగా సెలూన్ సేవలు.. ఎక్కడంటే..?
చంద్రగ్రహణం వచ్చిన 15 రోజుల తరువాత సూర్య గ్రహణం రానుంది. జూన్ 10వ తేదీన చంద్రుడు అగ్ని వలయంలా కనిపించనున్నాడు. అయితే భారత దేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఆ తరువాత నవంబర్ నెల 19వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో మాత్రమే ఈ గ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఈ ఏడాది డిసెంబర్ నెల 4వ తేదీన చివరి సూర్య గ్రహణం రానుంది.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
డిసెంబర్ 4వ తేదీన వచ్చే గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం కాగా ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు మే, జూన్, నవంబర్, డిసెంబర్ నెలలలో రానున్నాయి.