
మనలో చాలామంది పాలసీ తీసుకోవాలని అనుకుంటే ఎక్కువగా ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో ఉత్తమమైన పాలసీలను పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు ఆఫర్ చేస్తోంది. అయితే ఈ పాలసీతో పోలిస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్న పాలసీ వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీ వెల్త్ ప్లస్ పాలసీని అందిస్తుండగా ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో డబ్బులు పొందే అవకాశం ఉండగా పాలసీదారుడు మరణిస్తే మాత్రం పాలసీ తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు 6 సంవత్సరాలు కట్టాలి.
నెల, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 35 సంవత్సరాల వ్యక్తి లంసంమ్ ఆప్షన్ తో పాలసీ తీసుకుంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా 6 సంవత్సరాలు చెల్లిస్తే 12వ సంవత్సరం చేతికి ఏకంగా 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్‌కమ్ ఆప్షన్ ను ఎంచుకుని తొలి ఆరు ఏళ్లు ప్రీమియం చెలిస్తే 8వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది రూ.లక్ష వస్తాయి.
ఈ విధంగా ఏకంగా 30 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. చివరి ఏడాదిలో ఏకంగా 12 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ టర్మ్‌లో మరణిస్తే నామినీ 20 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 550 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.