
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలంకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతున్నది. వారం రోజుల క్రితం వరకు నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తున్నది. రోజూ రెండు లక్షలకుపైగా మూడు లక్షలకుతక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో తొమ్మిది రాష్ట్రాల్లో 50 వేలకు పైగా లక్షలోపు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంకో 19 రాష్ట్రాల్లో 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.