https://oktelugu.com/

ఇన్నాళ్లు ఒక లెక్క.. మోడీ వచ్చాక మరో లెక్క!

ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమనే మహాత్ముడు గాంధీజీ వారసుడు కాదు నరేంద్రమోడీ. అదే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా అందుకు విరుద్ధమైన భావజాలం.. దూకుడైన, ఢీ అంటే ఢీ అనే స్వభావమే ఇప్పుడు భారత్ ను బలంగా నిలబెడుతోంది. మోడీని హీరోను చేస్తోంది. భారత్ లో వినియోగించే కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న భారతీయులను యూరోపియన్ దేశాలకు నిరాకరించడంతో ఇటీవల వివాదం చెలరేగింది. భారత వ్యాక్సిన్లను ఈయూ దేశాలు గుర్తించకపోవడంతో మోడీ ప్రభుత్వం సీరియస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 / 04:36 PM IST
    Follow us on

    ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమనే మహాత్ముడు గాంధీజీ వారసుడు కాదు నరేంద్రమోడీ. అదే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా అందుకు విరుద్ధమైన భావజాలం.. దూకుడైన, ఢీ అంటే ఢీ అనే స్వభావమే ఇప్పుడు భారత్ ను బలంగా నిలబెడుతోంది. మోడీని హీరోను చేస్తోంది.

    భారత్ లో వినియోగించే కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న భారతీయులను యూరోపియన్ దేశాలకు నిరాకరించడంతో ఇటీవల వివాదం చెలరేగింది. భారత వ్యాక్సిన్లను ఈయూ దేశాలు గుర్తించకపోవడంతో మోడీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

    గ్రీన్ పాస్ పోర్టులను భారతీయులకు ఇవ్వని దేశాలను మోడీ సర్కార్ హెచ్చరించింది. పరస్పర విరుద్ధమైన విధానాన్ని అవలంభిస్తామని.. యురోపియన్ దేశాల నుంచి వచ్చే వారిని కూడా అలానే చేస్తామని హెచ్చరించారు.

    భారత ప్రభుత్వ హెచ్చరికకు ఈయూ దేశాలు దారికొచ్చాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, ఐర్లాండ్ మరియు స్పెయిన్ దేశాలు కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న భారతీయులను యూరప్ రావడానికి అనుమతించాయి. భారత ప్రభుత్వ హెచ్చరికతోనే ఈ దేశాలన్నీ దారికొచ్చాయి.

    గత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుుడు ప్రభుత్వం ఇలాంటి ఎదురుతిరుగుడు అన్నది చేసిందియే లేదు. విదేశీ దేశాలు భారత్ ను ఎంతో భయపెట్టేవి. ఎన్ని ఆంక్షలు పెట్టినా కాంగ్రెస్ సర్కార్ గమ్మున ఉండేది. ఇ్పుడు మోడీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయుల విషయంలో వేగంగా బాధ్యతగా స్పందిస్తోంది. దీంతో ఇతర దేశాలు కూడా వెంటనే గమ్మున ఉంటున్నాయి. ఢీ అంటే ఢీ అనే మోడీ సర్కార్ నైజమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత విలువను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.. మోడీ వచ్చాడు అన్నది అన్ని దేశాలకు తెలిసేలా కేంద్రం విధానం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.