
వీరబ్రహేంద్రస్వామి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్ నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకుంటుందని తెలిపారు. మఠాధిపతి ఎంపికకు ధార్మిక పరిషత్ అనుమతించిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సోమవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారికి వాయిదా వేసింది.