https://oktelugu.com/

బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ

ఏపీ సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా పంచాయితీ ఎన్నికల నగారా మోగించాడు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ శనివారం ఉదయం విడుదల చేశారు. Also Read: చట్టసభల్లో ఆధిపత్యం కోసం బైడెన్ ఫోకస్ ఇక స్థానిక ఎన్నికలపై […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2021 4:52 pm
    Follow us on

    Nimmagadda

    ఏపీ సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా పంచాయితీ ఎన్నికల నగారా మోగించాడు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ శనివారం ఉదయం విడుదల చేశారు.

    Also Read: చట్టసభల్లో ఆధిపత్యం కోసం బైడెన్ ఫోకస్

    ఇక స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

    ఏపీలో నాలుగుదశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని.. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు.

    ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ విధి అని.. సహకరించని అధికారులపై చర్యలు ఉంటాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. సీఎస్, పంచాయితీరాజ్ కార్యదర్శిని రమ్మన్నా రాలేదని.. 2019 జాబితాలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారు.

    Also Read: ఎట్టకేలకు అయోధ్య రామమందిర నిర్మాణం షురూ!

    *తొలి దశ ఎన్నికలు ఇలా..
    తొలి దశ షెడ్యూల్ ను జనవరి 23న ఈరోజు ప్రకటించారు. ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు.. జనవరి 25వరకు నామినేషన్ల స్వీకరణ.. జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తది గడువుగా నిర్ణయించారు. జనవరి 28న నామినేషన్ల పరిశీలన.. జనవరి 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన జరుపుతారు.

    జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. జనవరి 31న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 5వ తేదిన తొలి దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్