సినిమా పరంగా పవనన్న మాకు దేవుడు.. కానీ రాజకీయాలు.. పరిపాలనలో మాత్రం.. మాకు జగనన్న మాటే వేదం అంటూ.. గతంలో ‘ పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం’ అంటూ.. ఏపీలో ఊరూవాడా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదంతా వైసీపీ ప్లాన్ అనీ.. ఎన్నికల్లో జనసేను ఓట్లు పడకుండా.. మైండ్ గేమ్ ఆడారని అప్పట్లో పవన్ కల్యాణ్ ఓడిపోయాక అంతా అనుకున్నారు. ఇప్పడు పవన్ కల్యాణ్ కూడా అదే నిజమని నమ్ముతున్నాడు. ఆ మాటనే పవర్ స్టారే తన నోటితో చెప్పారు… తిరుపతి వెంకన్న సాక్షిగా.. ఇలా మాట్లాడారు..
Also Read: బ్రేకింగ్: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ
తనపై అభిమానం ఉన్నా.. ఏపీ ప్రజలు జగన్ కే ఓటు వేశారు. జగన్ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని నమ్మారు. ఇప్పడు ఆ నమ్మకాన్ని జగన్ కాల రాస్తున్నారని తిరుపతి వేదికగా చెప్పుకొచ్చారు. అయితే నిజంగా పవన్ కల్యాణ్ పై అభిమానం ఉన్న వారు జగన్ కు ఓటు వేయరని, జనసేననే గెలిపిస్తారని ఆశించారు. కానీ ఆ ఆశలను నిరాశ చేస్తూ.. కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే జనసేనకు పోలయ్యాయి.
ఎన్నికల ప్రచార సమయంలో పవన్ సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఫలితాల తరువాత దీన్ని పరిశీలించిన కొందరు రాజకీయ విశ్లేషకులు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా జగన్ కే ఓటు వేశారని తేల్చేశారు. ఎన్నికల ముందుకూడా పవన్ కల్యాణ్ ను వైస్ జగన్ వ్యక్తి గతంగా ఎంతో తిట్టారు. నిత్య పెళ్లి కొడుకుగా.. అభివర్ణించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దిగారు. ఇలాంటి సమయంలో వపన్ను అభిమానించేవారు… జగన్కు ఓటేస్తారని ఎవరూ నమ్మలేదు. అయితే వీరిలో చాలా మంది వివిధ వర్గాలకు చెందిన వారు జగన్ కు ఓటేసి.. గెలిపించేశారు.
Also Read: చరిత్రదాచిన భారత యోధుడు ‘సుభాష్ చంద్రబోస్’
ఎన్నికల తరువాత దీన్ని విశ్లేషించిన రాజకీయ వేత్తలు.. కేవలం బలహీన నాయకులను అభ్యర్థలుగా నిలబెట్టడమే.. పవన్ కల్యాణ్ చేసిన పొరపాటని తేల్చారు. సామాజిక వర్గం పరంగా అప్పటి అధికార పార్టీపై కులధ్వేషం నింపడం వల్లే వైసీపీ గెలిచిందని అంటున్నారు. వపన్ కు ఓటు వేస్తే… అది టీడీపీకి బలం అని ప్రచారం చేయడం .. వైసీపీ కూడా టీడీపీని అస్త్రంగా జనసేనపై సంధించడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఇప్పడు పవన్ కల్యాణ్ కూడా నమ్ముతున్నారు. తిరుపతిలో మాట్లడిన ఆయన వైసీపీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. హిందుత్వంపై అధికార పార్టీ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. మొత్తానికి గతానికి ఇప్పటికి.. డైరెక్టర్ ఎటాక్ లో పవన్ కల్యాణ్ కొంత మేర రాజకీయాలు నేర్చుకున్నారని అర్థం అవుతోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీతో పొత్తు వద్దన్న జన అధినేత ఎలా ముందుకు సాగాలన్నదానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్