ECHS Secunderabad Recruitment 2021: ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 65 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://echs.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది.
300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ సంస్థ భర్తీ చేయనుందని తెలుస్తోంది. డిగ్రీ, పీజీ పాసైన వాళ్లతో పాటు చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 21వ తేదీ చివరి తేదీగా ఉంది. https://newindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఫేజ్-1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 సంవత్సరం అక్టోబర్ నెలలో జరగనుండగా ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 సంవత్సరం నవంబర్ నెలలో జరగనుంది.