https://oktelugu.com/

దుబ్బాక ఎన్నిక: రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందా..

దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయా..? ఇన్నాళ్లు ఏ ఎన్నికలో అయినా ఏకపక్షంగా విజయం సాధించిన అధికార పార్టీకి ఈ ఉప ఎన్నికలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయా..? ప్రతిపక్ష సిట్టింగ్‌ సీట్‌ అయినా భారీ మెజార్టీతో ఖాతాలో వేసుకున్న టీఆర్‌‌ఎస్‌కు.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు ఇంతలా కష్టపడాల్సి వచ్చింది..? ఇన్ని డబ్బు.. గబ్బు రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ మామూలుగా ఎవరైనా సిట్టింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 11:28 AM IST
    Follow us on

    దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయా..? ఇన్నాళ్లు ఏ ఎన్నికలో అయినా ఏకపక్షంగా విజయం సాధించిన అధికార పార్టీకి ఈ ఉప ఎన్నికలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయా..? ప్రతిపక్ష సిట్టింగ్‌ సీట్‌ అయినా భారీ మెజార్టీతో ఖాతాలో వేసుకున్న టీఆర్‌‌ఎస్‌కు.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు ఇంతలా కష్టపడాల్సి వచ్చింది..? ఇన్ని డబ్బు.. గబ్బు రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది..?

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    మామూలుగా ఎవరైనా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపే సంప్రదాయం గతంలో ఉండేది. కానీ.. కేసీఆర్ కొలువుదీరాక దాన్ని పూర్తిగా మార్చేశారు. ఖాళీ అయిన చోటల్లా పోటీ చేసి గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు విపక్షాలు కూడా పోటీకి సై అన్నాయి. దుబ్బాకలో ప్రస్తుతం శాసనసభ్యుడి మరణం వల్ల వచ్చిన ఉపఎన్నికలా కాకుండా జనరల్ ఎలక్షన్ స్థాయిలో హీట్ పెరిగింది. ఇప్పుడు చనిపోయిన రామలింగారెడ్డి గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు. ఎవరు గెలిస్తే ఏమవుతుందన్న దానిపైనే చర్చ నడుస్తోంది.

    ఆది నుంచీ దుబ్బాక టీఆర్‌‌ఎస్‌కు కంచుకోట అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. సిద్దిపేట పక్కనే ఉండటం.. తెలంగాణ సెంటిమెంట్ గుండెల నిండా నింపుకుని ఉన్న మెదక్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం కావడంతో ఉద్యమంలోనూ పోరాడింది. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డికే ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు.

    Also Read: టీఆర్ఎస్ కష్టాలు.. కేటీఆర్‌కు సవాల్‌?

    అంతకుముందు టీడీపీలో ఉండే చెరుకు ముత్యం రెడ్డి కూడా ఎంతో పేరున్న నేత. సాధారణ రైతు అయిన ఆయన అభివృద్ధి ఎజెండాగా రాజకీయాలు చేసేవారు. ఉద్యమంతో కాస్త వెనుకబడిపోయారు. తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన కుమారుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ రావడంతో సెంటిమెంట్ ఎక్కడా వర్కవుట్ కావడం లేదు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ప్రచార అంశంగా మారింది.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కానీ.. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యం అంటూ ప్రధాన అంశంగా ప్రచారాస్త్రాన్ని ఎంచుకున్నప్పుడు టీఆర్‌‌ఎస్‌కు తిరుగులేదు. కానీ.. ఇప్పుడు అభివృద్ధి తెరమీదకు రావడంతో టీఆర్‌‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అందుకే.. రాష్ట్ర మంత్రి హరీష్‌ కూడా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ కనిపించారు. ఏమైనా అంటే మీటర్ల గురించి.. రైతు చట్టాల గురించే ప్రస్తావిస్తున్నారు. కానీ.. అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లాయో ఫలితాలు చూస్తే తెలుస్తుంది.

    Also Read: గ్రౌండ్ రిపోర్ట్: దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్..భారీగా పోలీసులు

    మరోవైపు ప్రత్యామ్నాయంగా వస్తున్న బీజేపీని కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. ప్రధాన ప్రత్యర్థిగా భావించిన టీఆర్‌‌ఎస్‌ కూడా బీజేపీనే టార్గెట్‌ చేస్తూ మాట్లాడింది. అటు బీజేపీకి సింపతి ఓట్లు రాల్చే ప్రయత్నం జరుగుతుండగా.. టీఆర్‌‌ఎస్‌ కేంద్రం వైఫల్యాలను ప్రస్తావించింది. అయితే.. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలో టీఆర్ఎస్‌ గెలిచినా భారీ మెజార్టీ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ ఫలితం అటు ఇటు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే.. ఈ దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు తీసుకురానుందనేది అర్థం అవుతోంది.