ఈసారి చిరు ఢీ కొట్టబోయేది హిందీ వాళ్లనే

మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్ మార్చారు. ‘ఖైదీ నెం 150’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా త్వరగానే కొత్తదనాన్ని ఒడిసిపట్టుకున్నారు. ప్రేక్షకులు ఏం కావాలో జాగ్రత్తగా గమనించిన ఆయన ఏదైనా భారీగా చేస్తేనే ఈరోజులల్లో చెల్లుబాటు అవుతుందని గమనించారు. అందుకే తన సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. క్రితంసారి ‘సైరా’తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ఆయన ప్లాన్ చేసి పెట్టుకున్నవన్నీ భారీ సినిమాలే. అన్నీ హెవీ యాక్షన్ ఏంటెర్టైనర్లే. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఆయన […]

Written By: admin, Updated On : November 3, 2020 11:39 am
Follow us on


మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్ మార్చారు. ‘ఖైదీ నెం 150’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా త్వరగానే కొత్తదనాన్ని ఒడిసిపట్టుకున్నారు. ప్రేక్షకులు ఏం కావాలో జాగ్రత్తగా గమనించిన ఆయన ఏదైనా భారీగా చేస్తేనే ఈరోజులల్లో చెల్లుబాటు అవుతుందని గమనించారు. అందుకే తన సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. క్రితంసారి ‘సైరా’తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ఆయన ప్లాన్ చేసి పెట్టుకున్నవన్నీ భారీ సినిమాలే. అన్నీ హెవీ యాక్షన్ ఏంటెర్టైనర్లే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఆయన సైన్ చేసిన చిత్రాల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం కూడ ఒకటి. శివ డైరెక్షన్లో అజిత్ నటించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ కథ మీద మెహర్ రమేష్ ఛాన్నాళ్ల పాటు కష్టపడి పనిచేసి తెలుగు పేక్షకుల అభిరుచుకి తగ్గట్టుగా మార్పులు చేశారట. మెహర్ రమేష్ చెప్ప్పిన ట్రీట్మెంట్ విన్న చిరు అది నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాక రాక చాలా ఏళ్ల తరవాత వచ్చిన అవకాశం కావడం, అందునా మెగాస్టార్ చిరంజీవితో కావడంతో మెహర్ రమేష్ చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్-4లో కోడిగుడ్ల మోత.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు..!

సినిమాలో ప్రధాన పాత్రల కోసం పెద్ద పెద్ద స్టార్లను తీసుకుంటున్నారు. ఇప్పటికే చిరు చెల్లెలిగా స్టార హీరోయిన్ కీర్తి సురేష్ ఫైనల్ కాగా ముఖ్యమైన ప్రతినాయకుడి పాత్రకు హిందీ నటుడిని తీసుకోవాలని, అందులోనూ పెద్ద నటుడ్ని తీసుకోవాలని చూస్తున్నారట. సినిమా మొదలుపెట్టే నాటికి అన్ని పనులు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగిపోయి ఉండాలని ఇప్పటినుండే కష్టపడుతున్నారు మెహర్ రమేష్. త్వరలోనే చిరు సరసన కథానాయికను కూడ ఫైనల్ చేసే అవకాశం ఉంది.