డొనాల్డ్ ట్రంప్ కు చింత చచ్చినా పులుపు చావని చందంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ దిగిపోయే ముందు అందరికీ షాకులు ఇస్తున్నాడు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి శరాఘాతంగా మారింది.
Also Read: నామో మోడీ.. పట్టంకట్టిన ప్రపంచ సర్వే సంస్థ..!
అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులు, ఉపాధి ఆధారిత వీసాల జారీపై విధించిన నిషేధాన్ని అధ్యక్షుడు ట్రంప్ మార్చి 31 వరకు పొడిగించాడు. అలాగే అమెరికా చట్టాలను ఉల్లంఘించిన తమ పౌరులను వెనక్కి రప్పించడానికి నిరాకరిస్తున్న దేశాలపై విధించిన వీసా ఆంక్షలను పొడిగిస్తున్నట్టు ప్రకటించి దుమారం రేపాడు.
ఏప్రిల్ నుంచి అమెరికాలో ట్రంప్ ఈ నిషేధాలను అమలు చేస్తున్నారు. ఇటీవలే నిషేధాల గడువును డిసెంబర్ 31, 2020తో ముగించాడు. మరోవైపు కొత్తగా అమెరికాలోకి రావాలనుకుంటున్న విదేశీయులు సొంతంగా ఆరోగ్య భీమా కలిగి ఉండాలంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తాజాగా ఫెడరల్ కోర్టు సమర్థించడం ఇరుకునపెట్టింది.
Also Read: చైనా అత్యుత్సాహం.. హిందూ మహాసముద్రంలోకి డ్రోన్లు
అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయే ముందు ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ కాకపుట్టిస్తున్నాడు. ఈ నిషేధాల పొడిగింపు కూడా చేసి అందరికీ షాకిచ్చాడు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించాడు.అమెరికాలోకి విదేశీయులకు ఉన్న పలు వెసులుబాట్లపై ట్రంప్ నిషేధం గుదిబండగా మారనుంది. అమెరికాలోని పౌరులు, నిరుద్యోగులకు ఈ నిర్ణయాలు ఊరటనిస్తాయి.
ట్రంప్ నిర్ణయాలను అక్కడి వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు జోబిడైన్ కూడా తీవ్రంగా తప్పుపట్టాడు. జోబైడెన్ అధ్యక్షుడైనా కూడా ఉపసంహరించడానికి వీలులేని విధానంలో ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది అందరికీ శరాఘాతంగా మారింది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు