కరోనా పాజిటివ్ వచ్చిందా.. ఏరోజు ఏం చేయాలంటే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే చాలామంది తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కరోనా నిర్ధారణ అయితే మొదటిరోజున సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడంతో పాటు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. జలుబుతో బాధ పడేవాళ్లు ఆవిరి పట్టుకుంటే మంచిది. రెండో రోజు కొత్త లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఆ లక్షణాలను డాక్టర్ కు తెలియజేయాలి. కరోనా నిర్ధారణ అయిన […]

Written By: Kusuma Aggunna, Updated On : May 21, 2021 10:14 am
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే చాలామంది తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కరోనా నిర్ధారణ అయితే మొదటిరోజున సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడంతో పాటు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. జలుబుతో బాధ పడేవాళ్లు ఆవిరి పట్టుకుంటే మంచిది. రెండో రోజు కొత్త లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఆ లక్షణాలను డాక్టర్ కు తెలియజేయాలి.

కరోనా నిర్ధారణ అయిన తరువాత అవసరమైతే ఇతర కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి. పల్స్ ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ యాంటీ వైరల్ మందులను వాడటం ద్వారా శరీరంలో వైరస్ పెరగకుండా నిరోధించాలి. ఐదు రోజుల తర్వాత జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి దగ్గు, ఆయాసం లాంటి లక్షణాలు తగ్గకపోతే రక్తపరీక్షలతో పాటు సీటీ స్కాన్ చేయించుకుంటే మంచిది.

సీటీ స్కాన్ లో ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాలి. పాజిటివ్ నిర్ధారణ అయిన వారం రోజుల తర్వాత కూడా జ్వరం, ఒళ్లునొప్పులు, ఇతర లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరడం మంచిది. 11 నుంచి 14 రోజుల వరకు యాంటీ వైరల్ మందులు వాడటంతో పాటు అవసరాన్ని బట్టి ఆక్సిజన్ తీసుకోవాలి. కరోనా సోకిన వెంటనే స్టిరాయిడ్స్ వాడటం మంచిది కాదు.

కరోనా రోగులు రెమ్ డెసివర్, ఫావిఫిరవిర్ మాత్రలను వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కరోనా సోకిన వాళ్లు ఎన్ 95 మాస్క్ ను మాత్రమే వినియోగించాలి. ద్రవపదార్థాలతో పాటు పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.