
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది దీపాల అలంకరణ. దీపావళి సాయంత్రం ప్రతి ఒక్కరూ వారి ఇంటిని దీపాలతో అలంకరించి ప్రత్యేక వేడుకగా జరుపుకుంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు కనుక దీపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత ఎర్రటి అక్షింతలు లేదా ఎర్రటి పువ్వులను దీపం ముందర ఉంచడం ద్వారా శుభం కలుగుతుంది.
Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
దీపాలను వెలిగించేటప్పుడు మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించడం ద్వారా వాతావరణంలో ఉన్న క్రిములను నశింపజేస్తాయి. అంతే కాకుండా మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అందుకోసమే స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేసినువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
సాధారణంగా కొంతమంది దీపావళి రోజున దీపాలకు బదులుగా కొవ్వొత్తులను వెలిగిస్తారు. అలా కొవ్వొత్తులను వెలిగించడం అతి పెద్ద పొరపాటని వేదపండితులు తెలియజేస్తున్నారు. కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని, కొవ్వొత్తి శోకానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. దీపావళి రోజున కేవలం మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా దైవశక్తులు ఆకర్షించి శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?
దీపాలను వెలిగించడం ద్వారా మన శరీరంలో ఉన్న అహంకారాన్ని వెలిగించి కాల్చ వేసినట్టని పండితులు తెలియజేస్తున్నారు. దీపం మన శరీరం అందులో వేసే నువ్వుల నూనె మనం చేసిన పాపం కార్యాలు అందులో వేసే ఒత్తులు అహంకారానికి గుర్తు. అటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా మనలో ఉన్న అహంకారం మొత్తం కాలిపోయి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, దీపం వెనుక దాగి ఉన్న అర్థం పరమార్థం ఇదేనని వేద పండితులు తెలియజేస్తున్నారు.
Comments are closed.