
వ్యాక్సిన్ల కొరత రాజధాని ప్రాంతంలో మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని టీకాలు రానందున టీకాల కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావొద్దని సూచించారు. దయచేసి వ్యాక్సిన్ కేంద్రాల ఎదుట బారులు తీరొద్దు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే మీ అందరికీ తెలియజేస్తాము. అప్పుడు వచ్చి వ్యాక్సిన్లు వేయించుకోండి అని కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు.