
కరోనా సెకండ్ వేవ్ తోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశానికి ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని ఢిల్లీ ఆల్ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా బాంబు పేల్చారు.
ఇప్పటికే కరోనాసెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగాన్ని వినిపిస్తోంది. రోజూ ల క్షల సంఖ్యలో కేసులు కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలతో భారత్ తల్లడిల్లుతోంది.
అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఏమాత్రం ఫలించడం లేదు. దీంతో ఎయిమ్స్ డైరెక్టర్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడికి సంబంధించిన చర్యలు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు. నైట్ కర్ఫ్యూ, వారంతపు లాక్ డౌన్ తో ఎలాంటి ప్రయోజనం ఉండదని రణ్ దీప్ గులేరియా తెలిపారు. కరోనా కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్ ఉత్తమ మార్గమని గులేరియా స్పష్టం చేశారు.
కరోనా కేసులను దేశంలో నియంత్రించాలంటే సంపూర్ణ లాక్ డౌన్ యే ఉత్తమ మార్గమని గులేరియా పునరుద్గాటించారు. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని సూచించారు.
దీంతో దేశంలో మరో లాక్ డౌన్ తప్పదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. లాక్ డౌన్ నిర్ణయం తీసుకోకపోతే మూడో వేవ్ తప్పదని.. అప్పుడు పెను వినాశనం ఎదురవుతుందని గులేరియా లాంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే లాక్ డౌన్ భయంతో వలస కార్మికులు అంతా కూడా స్వస్థలాలకు తరలిపోయారు. పనులన్నీ ఆగిపోయాయి. ప్రజలకు నిత్యావసరాలతోపాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.