కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పోస్టాఫీసులు ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే సంస్థ పోస్టాఫీస్ తరపున కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా 6 రకాల ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులో ఉంచగా అందులో గ్రామ్ సుమంగల్ స్కీమ్ కూడా ఒకటి. మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ అయిన గ్రామ్ సుమంగల్ కింద పది లక్షల రూపాయల మొత్తానికి పాలసీని తీసుకోవచ్చు.
ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు నిర్ణీత కాల వ్యవధుల్లో డబ్బులు వస్తాయి. పాలసీదారుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. గ్రామ్ సుమంగల్ పాలసీను 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో తీసుకోవచ్చు. 15 సంవత్సరాల టర్మ్ తో ఈ పాలసీని తీసుకుంటే 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
మెచ్యూరిటీ సమయంలో మిగిలిన 40 శాతం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ స్కీమ్ ను తీసుకుంటే 8, 12, 16 ఏళ్లలో పాలసీ 20 శాతం డబ్బులను తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో మిగిలిన 40 శాతం డబ్బులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. 20 ఏళ్ల కాల పరిమితితో నెలకు 2,850 రూపాయల చొప్పున రూ.7 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే 14 లక్షల రూపాయలు లభిస్తాయి.
సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పాలసీ కస్టమర్లకు ఎంతో ప్రయోజానకరంగా ఉంటుందని చెప్పవచ్చు.