సినిమాలు వద్దు అనుకొన్న దగ్గుబాటి బ్రదర్స్

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తన ఇద్దరు కుమారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారట. అందుకే వీరిద్దరిని విదేశాలలో ఉన్నతమైన చదువులు కూడా చదివించారు. అయితే ఊహించని విధంగా ఇద్దరూ సినీ రంగం లోనే సెటిల్ అయ్యారు.. ప్రస్తుతం ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారికి వారసుడిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను….సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న సురేష్ బాబుకి మొదట్లో నిర్మాతగా మారాలనే ఆలోచన లేదట…ఆ క్రమంలో అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత సిరామిక్స్ బిజినెస్ చేసాడట […]

Written By: admin, Updated On : April 30, 2020 4:50 pm
Follow us on


మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తన ఇద్దరు కుమారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారట. అందుకే వీరిద్దరిని విదేశాలలో ఉన్నతమైన చదువులు కూడా చదివించారు. అయితే ఊహించని విధంగా ఇద్దరూ సినీ రంగం లోనే సెటిల్ అయ్యారు..

ప్రస్తుతం ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారికి వారసుడిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను….సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న సురేష్ బాబుకి మొదట్లో నిర్మాతగా మారాలనే ఆలోచన లేదట…ఆ క్రమంలో అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత సిరామిక్స్ బిజినెస్ చేసాడట సురేష్ బాబు. అయితే అది పెద్దగా లాభదాయకం కాకపోవడంతో సురేష్ ప్రొడక్షన్ సంస్థలో తాత్కాలికంగా పని చేయడం మొదలు పెట్టాడట …… అలా సురేష్ ప్రొడక్షన్స్ లో నాలుగేళ్లు పని చేసిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లి పోదామని అనుకున్నాడట .. అయితే తమ్ముడు వెంకటేష్ ను హీరోగా లాంచ్ చేసే సమయం కావడంతో ఆగి పోవాల్సి వచ్చిందట ..

ఇక విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం చాలా సినిమాటిక్ గా జరిగిందట. నిజానికి బిజినెస్ మ్యాన్ అవ్వబోయి హీరో అయ్యాడట వెంకటేష్.. అదెలా జరిగిందంటే ‘కలియుగ పాండవులు’ మూవీ ని సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని రామానాయుడు అనుకున్నారట.. . ఈ విషయమై కృష్ణ తో మాట్లాడగా ఈ మూవీ సహ నిర్మాతగా ఏఎస్ ఆర్ ఆంజనేయులిని తీసుకోవాలని కృష్ణ కండిషన్ పెట్టారట … దీనికి రామానాయుడు ఒప్పుకోక, మరో హీరో కోసం వెతుకుతుండగా సన్నిహితులు.. మీ చిన్నబ్బాయి హీరోగా చక్కగా సరిపోతాడు అని సలహా ఇచ్చారట. అలా ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెండితెరకు హీరోగా వెంకటేష్ పరిచయం కావడం జరిగింది .