కన్నడ లో మెగా అల్లుడు

ప్రస్తుతం తెలుగు సినీ రంగం లో మెగా హీరోల హవా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , వరుణ్ తేజ్, బన్నీ , సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ మంచి ఫార్మ్ లో ఉన్నారు. అలాంటి టైం లో చిరంజీవి అల్లుడిగా ‘విజేత’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ పరాజయం చవి చూసాడు. దాంతో ఇపుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ […]

Written By: admin, Updated On : April 22, 2020 7:31 pm
Follow us on


ప్రస్తుతం తెలుగు సినీ రంగం లో మెగా హీరోల హవా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , వరుణ్ తేజ్, బన్నీ , సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ మంచి ఫార్మ్ లో ఉన్నారు. అలాంటి టైం లో చిరంజీవి అల్లుడిగా ‘విజేత’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ పరాజయం చవి చూసాడు. దాంతో ఇపుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా ‘సూపర్ మచ్చి’ చిత్రాన్నిచేస్తున్నాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రియా చక్రవర్తి మరియు రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయకొచ్చింది.

‘సూపర్ మచ్చి’ సినిమాని తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.దర్శక నిర్మాతలు…. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. సహజంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే అన్ని సినిమాలు కన్నడ లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి .. . వాటికీ అక్కడ మంచి మార్కెట్ కూడా లభిస్తోంది . ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా అల్లుడిని కూడా కన్నడిగులకు పరిచయం చేయాలని ‘సూపర్ మచ్చి’ యూనిట్ భావిస్తోందట..