Homeఅత్యంత ప్రజాదరణCrazy Uncles Telugu Movie Review : ‘క్రేజీ అంకుల్స్’ మూవీ - ...

Crazy Uncles Telugu Movie Review : ‘క్రేజీ అంకుల్స్’ మూవీ – హిట్టా ? ఫట్టా ?

Crazy Uncles Movie Reviewనటీనటులు : శ్రీ‌ముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, అదుర్స్ ర‌ఘు, గిరిధ‌ర్, హేమ‌ తదితరులు,
దర్శకత్వం: ఇ. స‌త్తిబాబు,
నిర్మాత‌లు: గుడ్ ఫ్రెండ్స్ & బొడ్డు అశోక్,
సంగీతం : ర‌ఘు కుంచె,
ఎడిటింగ్‌ : నాగేశ్వ‌ర రెడ్డి,

స్మాల్ స్క్రీన్ ఆల్ టైమ్ బ్యూటీ శ్రీముఖి(Sreemukhi), సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’(Crazy Uncles). సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ :

రెడ్డి (సింగర్ మనో), రాజు (రాజా రవీంద్ర), రావు (భరణి) ముగ్గురు స్నేహితులు. ముగ్గురికి తమ భార్యలతో కొన్ని సమస్యలు ఉంటాయి. దాంతో తమ సంసార జీవితంలో దొరకని సుఖాన్ని బయట వెతుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఫేమస్ సింగర్ స్వీటీ (శ్రీ‌ముఖి) పై ముగ్గురు కన్ను పడుతుంది. ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెతో గడపాలని రెడ్డి, రాజు, రావు ఒకరికి తెలియకుండా ఒకరు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ స్వీటీతో వాళ్ళ బంధం ఎంతవరకు సాగింది ? చివరకు ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

క్రేజీ అంకుల్స్ గా నటించిన సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి తమ పాత్రలకు తగ్గట్లు తమ బాడీ లాంగ్వేజ్ ను బాగా మెయింటైన్ చేశారు. ముఖ్యంగా మనో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు శ్రీముఖి గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో, అలాగే క్లైమాక్స్ సన్నివేశంలో ‘మనో’ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా అభినయించాడు.

ఇక స్వీటీ అనే సింగర్ గా నటించిన శ్రీముఖి కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. యోగా గురువుగా కనిపించిన పోసాని తన పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు ఇ. స‌త్తిబాబు రాసుకున్న కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినా.. కథలో ప్లో మిస్ అయింది.

మెయిన్ గా కథనం ఎక్కడా ఆకట్టుకొన్నే విధంగా లేదు. అన్నిటికి మించి ఏ సన్నివేశం కథలో మిళితమయ్యి ఉండదు. పెట్టిన ట్విస్ట్ లు కూడా సిల్లీగా ఉన్నాయి. అయితే దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టాడు. ఆ తరువాతే అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.

పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఓవరాల్ గా ఇ. స‌త్తిబాబు ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

ప్లస్ పాయింట్స్ :

మెయిన్ పాయింట్,
శ్రీముఖి గ్లామర్,

మైనస్ పాయింట్స్ ;

కథాకథనాలు,
సిల్లీ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రెగ్యులర్ బోల్డ్ కంటెంట్,
రొటీన్ నేరేషన్,
నేపథ్య సంగీతం.
అన్నిటికి మించి ఈ సినిమా దర్శకడు పనితనం.

సినిమా చూడాలా ? వద్దా ?

సినిమా మెయిన్ పాయింట్ లో కంటెంట్ ఉంది, కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ రొట్ట కొట్టుడు వ్యవహారాల తతంగమే. కాబట్టి, ఈ సినిమాని చూసి విసిగి వేసారి పోవద్దు అని మా మనవి.

రేటింగ్: 2/5

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular