
తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్ లో ముష్కరులు విధ్వంసకాండ మొదలైంది. నిన్న తాలిబన్లపై నిరసన ప్రదర్శన చేసిన కొందరిపై కాల్పులు జరపగా.. తాజాగా నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీలో తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆఫ్గానిస్థాన్ లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు. ఈసారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయిే అసదాబాద్ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు.