
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా తుది జట్టును ఖరారు చేసింది. ఆరోన్ ఫించ్ ను సారథ్య బాధ్యతలను అప్పగించింది. పాట్ కమిన్స్ కు వైస్ కెప్టెన్ గా నియమించింది. తొలి సారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కు జో ష్ ఇంగ్లిస్ కు జట్టులో చోటు కల్పించారు. డాన్ క్రిస్టియన్, డానియల్ సామ్స్, నాథన్ ఈల్లిస్ జట్టులో రిజర్వు ఆటగాళ్లుగా ఎంపిక చేసింది.
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఆస్టాన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హజిల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, వానే రిచర్డ సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనిస్, మిచెల్ స్వెప్ సన్, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.