అయ్యప్ప స్వాములు జరపైలం.. పొంచివున్న మహమ్మరి..!

కార్తీక మాసం ముందు నుంచి అయ్యప్ప భక్తులు మాలధరణ.. మండల దీక్షలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 40రోజులపాటు భక్తిశ్రద్ధలతో దీక్షలు చేసి ఇరుముడితో స్వాములంతా శబరిమలకు వెళుతుండటం ప్రతీయేటా చూస్తూనే ఉంటాం. Also Read: మినీ ‘పుర పోరు’కు సై అంటున్న ఎన్నికల కమిషన్.. పార్టీలు సిద్ధమేనా..? శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తులకు స్వర్గధామం లాంటింది. అయ్యప్ప స్వామి శబరిమలలోనే కొలువు ఉన్నాడని భక్తుల నమ్మకం. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద […]

Written By: Neelambaram, Updated On : January 2, 2021 11:58 am
Follow us on

కార్తీక మాసం ముందు నుంచి అయ్యప్ప భక్తులు మాలధరణ.. మండల దీక్షలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 40రోజులపాటు భక్తిశ్రద్ధలతో దీక్షలు చేసి ఇరుముడితో స్వాములంతా శబరిమలకు వెళుతుండటం ప్రతీయేటా చూస్తూనే ఉంటాం.

Also Read: మినీ ‘పుర పోరు’కు సై అంటున్న ఎన్నికల కమిషన్.. పార్టీలు సిద్ధమేనా..?

శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తులకు స్వర్గధామం లాంటింది. అయ్యప్ప స్వామి శబరిమలలోనే కొలువు ఉన్నాడని భక్తుల నమ్మకం. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

ప్రతీయేటా మకర సంక్రాంతి రోజున జ్యోతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు వెళుతుండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే సంక్రాంతి కొద్దిరోజుల సమయం ఉండగానే శబరిమలలో కరోనా కలకలం సృష్టిస్తుండటం శోచనీయంగా మారింది.

Also Read: అమ్మఒడి పథకంలో చేరేవారికి అలర్ట్.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..?

తాజాగా శబరిమలలో 37మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన రేపుతోంది. శబరిమల మకరవిళక్కు ఉత్సవాల్లో పాల్గొన్న ఆరుగురు అర్చకులతోపాటు 37మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయ అధికారులు అందరినీ అలర్ట్ చేస్తున్నారు.

పాజిటివ్ నిర్ధారణ వారందరినీ ఐసోలేషన్ కు తరలించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ కరోనా టెస్టులు చేసేందుకు వైద్య సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ఆదేశాలు జారీ చేసింది. కరోనా విషయంలో అయ్యప్ప భక్తులు అలర్ట్ ఉంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్