https://oktelugu.com/

‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ పై వివాదం..!

బాహుబలి-2’ తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). అత్యంత భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ సడెన్ వాయిదా వెనుక కారణమెంటీ? ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నాడు. చరణ్ పుట్టినరోజు కానుకగా ‘భీమ్ ఫర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 12:27 pm
    Follow us on

    Copy Allegations on Ramaraju For Bheem Teaser

    బాహుబలి-2’ తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). అత్యంత భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ సడెన్ వాయిదా వెనుక కారణమెంటీ?

    ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నాడు. చరణ్ పుట్టినరోజు కానుకగా ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజ్ కాగా సన్సేషన్ క్రియేట్ చేసింది. చరణ్ ను జక్కన్న పోలీస్ ఆఫీసర్ గా చూపించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.

    నిన్న కొమురంభీం జయంతి సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను జక్కన్న రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ కొన్ని వివాదాలు చుట్టుముట్టేలా కన్పిస్తున్నాయి. టీజర్లో ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

    నిజాం పాలన.. రజాకార్లకు వ్యతిరేకంగా కొమురంభీం పోరాటాలు చేశాడని.. ఆయన కూతురుని నాటి ముస్లిం పాలకులు ఇబ్బందులు గురిచేశారని ఎన్నో చారిత్రాక ఆధారాలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు సైతం తన ట్విట్టర్లో స్పందించారు. చరిత్రను వక్రీకరించొద్దని.. ఇలాచేసే బాలీవుడ్ తన క్రెడిబిలిటీని కొల్పోయిందని రాజమౌళిని సున్నితంగా హెచ్చరించారు.

    ఇలాంటివి ముందే ఊహించిన రాజమౌళి ఇది పూర్తిగా కల్పితగాథ అని సినిమాకు ముందే ప్రకటించాడు. రాజమౌళి ఎన్టీఆర్ కు కొమురం భీమ్ పేరు పెట్టడమే కాకుండా ఆయన జయంతి రోజునే టీజర్ విడుదల చేశాడు. చివర్లో కొమురంభీం ను ముస్లింగా చూపించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు.

    ఇంటర్నెట్ – సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఫిలిం మేకర్స్ ఏ సినిమా చేసినా అందులో ఈ సీన్ కాపీ అని.. స్టోరీ దీనికి ఇన్స్పిరేషన్ అని.. సాంగ్ పలానా ట్యూన్ కి అనుకరణ అని ఆధారాలతో సహా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

    ఇదే క్రమంలో ‘రామరాజు ఫర్ భీమ్’ లోని కొన్ని షాట్స్ వేరే చోట నుంచి ఎత్తేశారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇందులో కనిపించిన కొన్ని షాట్స్ వేరే చిత్రాలను పోలి ఉన్నాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

    Also Read: ‘ఆరెంజ్’ దెబ్బకు అన్నయ్య నాగబాబు ఆస్తులు అమ్ముకున్నాడు.. పవన్ భావోద్వేగం

    ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోలో ఓ అగ్ని పర్వతం బద్ధలైనట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఆ షాట్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో అగ్నిపర్వతాల విస్ఫోటనం వీడియోలోని ఓ షాట్ ని జత చేస్తూ.. జక్కన్న కూడా కాపీ చేసాడని కామెంట్స్ చేస్తున్నారు.

    కొమురంభీం పాత్ర కల్పిమైతే ఆయన జయంతి రోజున ఎందుకు టీజర్ విడుదల చేశారంటూ లాజిక్ తీస్తున్నారు. గతంలో పవన్ కొమురం పులి సినిమా టైంలో కొమురం అని టైటిల్ వాడినందుకే పెద్ద రచ్చ జరిగింది. తాజాగా రాజమౌళి కొమురంభీమ్ ను ముస్లింగా చూపించడంతో ఇది మరింత వివాదంగా మారేలా కన్పిస్తోంది. దీనిపై రాజమౌళి ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో వేచిచూడాల్సిందే..!