పవన్‌కు ఆహ్వానం లేదా..? కావాలనే అటెండ్‌ కాలేదా..?

జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి వేదికగా నడుస్తున్న ఉద్యమం నిన్నటితో ఏడాదికి చేరుకుంది. ఈ సందర్భంగా నిన్న జనభేరి సభ నిర్వహించారు. ఈ సభను టీడీపీ అన్నీ తానై ముందుకు నడిపించింది. వేదికపైనే మొత్తం టీడీపీ నేతలే కనిపించారు. ఎప్పటిలా పార్టీ కండువాలు కాకుండా.. రైతు గుర్తుగా ఆకు పచ్చ కండువాలను వేసుకున్నారు. Also Read: తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు? ఈ సభకు బీజేపీ, వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 1:31 pm
Follow us on


జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి వేదికగా నడుస్తున్న ఉద్యమం నిన్నటితో ఏడాదికి చేరుకుంది. ఈ సందర్భంగా నిన్న జనభేరి సభ నిర్వహించారు. ఈ సభను టీడీపీ అన్నీ తానై ముందుకు నడిపించింది. వేదికపైనే మొత్తం టీడీపీ నేతలే కనిపించారు. ఎప్పటిలా పార్టీ కండువాలు కాకుండా.. రైతు గుర్తుగా ఆకు పచ్చ కండువాలను వేసుకున్నారు.

Also Read: తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు?

ఈ సభకు బీజేపీ, వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచీ తలసిరెడ్డి హాజరయ్యారు. అసలు ఉన్నాయో లేవోననుకున్న పార్టీల నుంచి హాజరైన పలువురి పేర్లను పచ్చ మీడియా కూడా బాగానే హైలైట్‌ చేసింది. కానీ.. ప్రభుత్వంపై నిత్యం గొంతెత్తి నిలదీసే జనసేన తరఫున మాత్రం ఎవరూ ఈ సభకు వెళ్లలేదు. ఇంతకీ ఈ జనభేరి సభపై జనసేనాని పవన్‌కు ఆహ్వానం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఒకవేళ ఆహ్వానం ఉన్నా పవన్‌ స్వయంగా తప్పుకున్నారా అనేది తెలియకుండా ఉంది.

అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమాన్ని టీడీపీయే మొదలుపెట్టినా.. ఇతర ప్రాంతాల్లో వస్తున్న నిరసనలతో కొన్ని రోజులు అంటిముట్టనట్టు వ్యవహరించారు ఆ పార్టీ నేతలు. జోలెపట్టి ఊరూరా తిరుగుతానన్న బాబు, అర్ధంతరంగా అడుక్కునే కార్యక్రమాన్ని అటకెక్కించారు. కరోనా దెబ్బతో తండ్రీకొడుకులిద్దరూ హైదరాబాద్ చెక్కేయడంతో ఇక్కడ ఎవరూ కనిపించలేదు.

Also Read: రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కేసీఆర్ సమాలోచన.. సుప్రీంకు వెళుతారా?

బీజేపీ ఇటీవల ఉద్యమానికి పూర్తి మద్దతివ్వడం మొదలు పెట్టింది. పవన్ కల్యాణ్ మాత్రం ఆది నుంచి ఒకే మాటపై ఉన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసినా.. ఏపీ హైకోర్టులో జనసేన తరపున అమరావతికి జై అంటూ పవన్ అఫిడవిట్ వేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. అలాంటి పవన్ ఏడాది సంబరంలో ఎందుకు పాల్గొనలేదనేది చర్చనీయాంశమైంది. జనసేన తరపున ఎవరినైనా పంపించడం, వారు హైలెట్ కావడం పవన్ కి ఇష్టం లేదట. ఒకవేళ తానే నేరుగా వెళ్లాలంటే అక్కడ బాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందనే భయం ఉండనే ఉంది. అన్నింటికీ మించి ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నారు. షూటింగ్ మూడ్‌లోకి వెళ్తే ఇక పవన్ కి ప్రజలు పట్టరు. అందుకే ఆయన జనభేరిని పక్కనపెట్టి, సినిమా భేరిలో మునిగిపోయారని టాక్‌.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్