మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మొదటి నుండి కొత్తదనం చూపించి హిట్స్ అందుకున్న హీరో అంటే ముందుగా వరుణ్ తేజ్ పేరే గుర్తుకువస్తోంది. మూస సినిమాలకు మనోడు వ్యతిరేకం, వైవిధ్యంగా కథ ఉండకపోయినా కనీసం తన పాత్ర అయినా విభిన్నంగా ఉండాలని వరుణ్ తేజ్ తెగ తాపత్రయ పడుతుంటాడు. అందుకే, వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నాడు. అదే ఊపులో ప్లాన్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ మెగా హీరో. కాగా తాజాగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో భోగవిల్లి ప్రసాద్ కు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆగలేకపోతున్నా.. సమ్మర్ ముందే వచ్చేయవా – నిహారిక
ఈ సినిమా పూర్తిగా యుకె లోనే షూట్ చేయాల్సి వుంటుందట. అంటే, ఇదేదో కొత్త అటెంప్ట్ అనుకోవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో. అన్నట్టు ఈ సినిమా కోసం ఈ మెగా హీరో ఎక్కువ పారితోషికం కోరుకుంటున్నాడని.. వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసీనా.. భోగవిల్లి ప్రసాద్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడని.. మొత్తంగా ఈ సినిమాకి వరుణ్ తేజ్ తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. తొమ్మిది కోట్లు అంటే చాలా ఎక్కువ. పైగా వరుణ్ కి మాస్ ఫాలోయింగ్ కూడా లేదు. అలాంటప్పుడు అంత భారీ మొత్తాన్ని ఎలా అడుగుతున్నాడో వరుణ్ కే తెలియాలి.
Also Read: రిలీజ్ కు ముందే 24 కోట్లు లాభం !
అసలు కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం రెమ్యూనరేషన్ ను తగ్గించాలని “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇస్తుంటే.. వరుణ్ తేజ్ ఇలా భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తూ.. అంతే మొత్తాన్ని తీసుకుంటున్నాడు. పాపం మరోపక్క నిర్మాతలు రెమ్యూనరేషన్ ను తగ్గించుకోండి మహాప్రభో అని అందర్నీ అడుగుతున్నా.. వరుణ్ తేజ్ లాంటి హీరోలు మాత్రం అలాంటి అభ్యర్ధనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్