Movie ticket: సినిమా టికెట్ల రేట్లు పెంపుపై కండిషన్స్ అప్లయ్..!

Movie ticket: సినిమా ఇండస్ట్రీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సినిమాటోగ్రఫీ యాక్ట్ లో మార్పులు చేర్పులు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, బెనిఫిట్ షోల రద్దు, సినిమా టికెట్ల ధరలను పెంచకపోవడం వంటివి చేస్తుందని అర్థమవుతోంది. సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఏపీ సర్కారు నిర్ణయాలు ఉండటంతో వీటిపై ఇండస్ట్రీతోపాటు జనాల్లోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి చిత్రపరిశ్రమలోని పెద్దలు మద్దతు […]

Written By: NARESH, Updated On : November 27, 2021 11:07 am
Follow us on

Movie ticket: సినిమా ఇండస్ట్రీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సినిమాటోగ్రఫీ యాక్ట్ లో మార్పులు చేర్పులు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, బెనిఫిట్ షోల రద్దు, సినిమా టికెట్ల ధరలను పెంచకపోవడం వంటివి చేస్తుందని అర్థమవుతోంది. సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఏపీ సర్కారు నిర్ణయాలు ఉండటంతో వీటిపై ఇండస్ట్రీతోపాటు జనాల్లోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

movie tickets

ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి చిత్రపరిశ్రమలోని పెద్దలు మద్దతు ఇస్తున్నారు. అయితే టికెట్ల రేట్లు పెంచకపోవడంపై మాత్రం ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లు కన్పిస్తోంది. చిన్న సినిమాల నిర్మాతలు జగన్ సర్కారుకు మద్దతు తెలుపుతుండగా పెద్ద సినిమా నిర్మాతలు, బడా హీరోలు మాత్రం దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇష్యూపై సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లారు.

టికెట్ల పెంపుతో ప్రజలపై భారం పడుతుందని ఏపీ సర్కారు వాదిస్తుంది. దీంతో టికెట్ల రేట్ల పెంపు అంశం కొద్దిరోజులుగా అటకెక్కింది. కరోనాతో ఇప్పటికే ఇండస్ట్రీ చాలా నష్టపోవాల్సి వచ్చిందని టికెట్ల రేట్లు పెంచకపోతే పరిశ్రమ మరింత దెబ్బతింటుందని సినీ పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు.

గతంలో కంటే సినిమా ఖర్చు పెరిగిపోయిందని తెలుగు సినిమా క్వాలిటీని పెంచేలా నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని వారిని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వంపై ఉందంటూ చిరంజీవి లాంటి పెద్దలు ప్రభుత్వానికి సున్నితంగానే విన్నవిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏపీ సర్కారు ఇండస్ట్రీని దెబ్బతీసేలా ప్రవర్తించడంపై బహిరంగగానే మండిపడుతున్నారు. ఈక్రమంలోనే ఏపీ సర్కారు టికెట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

టికెట్ల పెంపుపై వాడీవేడిగా చర్చ నడుస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ట్వీట్ చేశారు. దేశంలో జీఎస్టీ ఒకేలా ఉన్నప్పుడు టికెట్ల రేట్లు కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటే తప్పెంటీ? అన్న ప్రశ్నను లెవనెత్తారు. పలు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు భారీగానే ఉన్నాయని ఏపీ సర్కారు వాటిని పరిశీలించి టికెట్ల రేట్లను పెంచాలని ఆయన కోరారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి చెప్పిన ఆలోచనను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళుతానన్నారు.

ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇటీవల ఏపీ సర్కారు ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకొచ్చిన విధానం గుర్తుకు వస్తుంది. దీని ప్రకారం కాలేజీలకు అతితక్కువ ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గిట్టుబాటు కాదు అనుకునే వారంతా సదరు కమిషన్ కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఫీజులు పెంచుకునే వెలుసుబాటు కల్పిస్తారు. ఇదే సూత్రాన్ని సినిమా టికెట్లకు వర్తింపజేసే అవకాశం కల్పిస్తోంది. టికెట్ల రేట్లు గిట్టుబాటు కాదు అనుకున్న వారు ప్రభుత్వానికి విన్నవిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.

దీని ద్వారా ఇండస్ట్రీలో తమకు అండగా ఉండేవారికి టికెట్లు పెంచుకునేలా వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా వ్యతిరేకంగా ఉండేవారిని కట్టడి చేసే అవకాశం ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే టికెట్ల పెంపు ఖాయమనే సంకేతాలను ప్రభుత్వం పంపుతోంది. అయితే కండిషన్స్ అప్లయ్ చేస్తుండటం మాత్రం ఆసక్తిని రేపుతోంది.