మూవీ రివ్యూః కోల్డ్ కేస్‌

నటీనటులుః పృథ్విరాజ్ సుకుమార్‌, అదితి బాన్‌, అనిల్ నెడుమ‌గ‌ద్‌, ల‌క్ష్మీప్రియ, అతిమ్య రాజ‌న్‌ త‌దిత‌రులు దర్శకత్వంః త‌ను బాల‌క్‌ నిర్మాత‌లుః ఆంటో జోసెఫ్‌, జోమోన్ టి.జాన్‌, స‌మీర్ మ‌హ‌మ్మ‌ద్‌ సంగీతంః ప్ర‌కాశ్ అలెక్స్‌ రిలీజ్ః అమెజాన్ ప్రైమ్ క్రైమ్ జోన‌ర్లో క‌థ‌లు ఎన్నో తెర‌కెక్కాయి. హార‌ర్ జోన‌ర్లోనూ చాలా సినిమాలు వ‌చ్చాయి. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డంతో క్రైమ్ సినిమా, దెయ్యం వ‌దిలిపోవ‌డంతో హార‌ర్ మూవీ ముగిసిపోతుంది. కానీ.. ఈ ‘కోల్డ్ కేస్’ మాత్రం ఈ రెండు జోన‌ర్ల‌ను క‌లిపి […]

Written By: Bhaskar, Updated On : July 1, 2021 4:29 pm
Follow us on

నటీనటులుః పృథ్విరాజ్ సుకుమార్‌, అదితి బాన్‌, అనిల్ నెడుమ‌గ‌ద్‌, ల‌క్ష్మీప్రియ, అతిమ్య రాజ‌న్‌ త‌దిత‌రులు
దర్శకత్వంః త‌ను బాల‌క్‌
నిర్మాత‌లుః ఆంటో జోసెఫ్‌, జోమోన్ టి.జాన్‌, స‌మీర్ మ‌హ‌మ్మ‌ద్‌
సంగీతంః ప్ర‌కాశ్ అలెక్స్‌
రిలీజ్ః అమెజాన్ ప్రైమ్

క్రైమ్ జోన‌ర్లో క‌థ‌లు ఎన్నో తెర‌కెక్కాయి. హార‌ర్ జోన‌ర్లోనూ చాలా సినిమాలు వ‌చ్చాయి. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డంతో క్రైమ్ సినిమా, దెయ్యం వ‌దిలిపోవ‌డంతో హార‌ర్ మూవీ ముగిసిపోతుంది. కానీ.. ఈ ‘కోల్డ్ కేస్’ మాత్రం ఈ రెండు జోన‌ర్ల‌ను క‌లిపి రూపొందించ‌డం విశేషం. మ‌రి, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రించింది అన్న‌ది చూద్దాం.

క‌థః ఓ జాల‌రి చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్తాడు. అయితే.. వ‌ల‌లో అత‌నికి ఓ మ‌నిషి పుర్రె చిక్కుతుంది. ఈకేసు ఛేధించే బాధ్య‌త‌ ఏసీపీ (పృథ్విరాజ్ సుకుమారన్‌) తీసుకుంటాడు. మ‌రోవైపు ఇన్విస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసే పద్మ‌జ (అదితి బాల‌న్‌) కు కొత్త ఇంట్లో దెయ్యంతో కూడిన స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆ పుర్రె ఎవ‌రిది? ఏసీపీ దాన్ని ఛేదిస్తాడా? ప‌ద్మ‌జ ఇంటికి దాంతో ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది క‌థ‌.

విశ్లేష‌ణః క్రైమ్‌, హార‌ర్ జోన‌ర్ల‌ను క‌లిపి క‌థ రాసుకోవ‌డం అనేది ఓ కొత్త పాయింట్‌. ఈ కేసును ఛేదించేందుకు ఏసీపీ ప్ర‌య‌త్నిస్తుంటాడు. మ‌రోవైపు.. కొత్త ఇంట్లో జ‌ర్న‌లిస్టును ఎవ‌రో ఫాలో అవుతున్న‌ట్టుగా ఉంటారు. ఈ రెండు పాయింట్ల‌ను పార‌లాల్ గా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అన‌వ‌స‌ర‌మైన పాట‌లు, ఇత‌ర స‌న్నివేశాలు జోడించ‌కుండా.. ప్రేక్ష‌కుడి దృష్టిని క‌థ మీద‌నే ఉండేలా చూసుకున్నాడు. ట్విస్టులు, అంచ‌నాల‌తో సినిమా సాగిపోతూ ఉంటుంది. అయితే.. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త నెమ్మ‌దించిన‌ట్టుగా అవుతుంది. హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్రేక్ష‌కుడు ఊహించ‌కుండా చివ‌రి వ‌ర‌కు క్యూరియాసిటీని మెయింటెయిన్ చేశాడు. చివ‌రి అర‌గంట మంచి ఉత్కంఠ రేకెత్తించినా.. ప్రీ క్లైమాక్స్ ఎండింగ్ తోనే ముగింపు ఏంట‌న్న‌ది తెలిసిపోతుంది. ఓవ‌రాల్ గా మాత్రం క్రైమ్‌, హార‌ర్ జోన‌ర్ల‌ను ఇష్ట‌ప‌డే వారికి మంచి ఆప్ష‌న్ ఈ కోల్డ్ కేస్‌.

పెర్ఫార్మెన్స్ః ఏఈసీపీగా పృథ్విరాజ్ సుకుమారన్ చ‌క్క‌గా న‌టించాడు. ఇలాంటి చిత్రాలు మేజ‌ర్ గా సింగిల్ ఎక్స్ ప్రెష‌న్ తోనే ర‌న్ అయిపోతూ ఉంటాయి కాబ‌ట్టి.. న‌ట‌న‌కు స్కోప్ ద‌క్క‌లేదు. మిగిలిన న‌టులు కూడా త‌మ ప‌రిధిమేర న‌టించారు. ఇక‌, ఇలాంటి సినిమాల‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత కీల‌క‌మో తెలిసిందే. దాన్ని ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా.. చ‌క్క‌గా స‌మ‌కూర్చాడు ప్ర‌కాశ్ అలెక్స్‌. ఫొటోగ్ర‌ఫీ కూడా ప‌ర్ఫెక్ట్‌. ఎడింగ్ లో ఎక్క‌డా ఎక్స్ ట్రాలు లేకుండా.. కావాల్సినంత వ‌ర‌కే ట్రిమ్ చేశారు. ఓవ‌రాల్ గా అంద‌రూ త‌మ డ్యూటీని ప‌ర్ఫెక్ట్ గా నిర్వ‌ర్తించారు.

బ‌లాలుః క‌థ‌, ఫ‌స్ట్ హాఫ్‌, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌

బ‌ల‌హీన‌త‌లుః సెకండ్ హాఫ్ స్లో నెరేష‌న్‌

లాస్ట్ లైన్ః కోల్డ్ కేస్‌.. హీట్ పెంచుతుంది!

రేటింగ్ 5/2.75