విశాఖపట్నంలో విజయసాయిరెడ్డిదే హవా. ఆయన ఎంత చెబితే అంతే. మాటకు ఎదురుండదు. ముఖ్యమంత్రి ఫొటో కంటే ఆయన ఫొటోనే పెద్దగా వేయించుకున్నా పట్టించుకునే వారుండరు. అధికారమంతా ఆయనదే. ఆయన మాటకే చెల్లు. ఆయన ఎంత చెబితే అంతే. ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తోంది. విశాఖ తీరం అయితే విజయసాయిరెడ్డి వెంటే. అధికార పార్టీ అయినందున వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. తాజాగా విజయసాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి ఫొటో కంటే ఆయన ఫొటోనే పద్దదిగా ఉండడం గమనార్హం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజునే సాధారణంగా జరిపే వివాఖ వాసులు విజయసాయి రెడ్డి బర్త్ డేను మాత్రం ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే విశాఖ నగరమంతా ఫ్లెక్సీలతో వెలిశాయి. సీఎం అయ్యాక తొలి పుట్టిన రోజు వేడుకలు సైతం సర్వసాధారణంగానే జరుపుకున్నారు. అక్కడక్కడ మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా విజయసాయికి మాత్రం విశాఖ నగరమంతా ఎటు చూసినా ఆయన ఫ్లెక్సీలే కనిపించడం గమనార్హం.
జులై 1 గురువారం విజయసాయి రెడ్డి బర్త్ డే ఉన్నందున విశాఖ మొత్తం శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. విజయసాయిరెడ్డి ప్రాపకం కోసం వెంపర్లాడే నేతలంతా తమ విధేయతను చాటుతూ నగరాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఎటు చూసినా విజయసాయి ఫొటోలే ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఫొటోలు కనిపించడం లేదు. దీంతో సీఎం కంటే విజయసాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుస్తోంది.
వడ్డించే వాడు మనవాడైతే చివరి ఫంక్తిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు. విశాఖలో ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించారు. అయినా అధికార పార్టీ కావడంతో వారికి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవడంతో వారికి చట్టాలు పట్టవనే సంగతి తెలుస్తోంది. సామాన్యుడైతే ఎప్పుడో పీకేసే అధికారులు వైసీపీ జోలికి మాత్రం రావడం లేదు. దీంతో సామాన్యులు సైతం మీదికి చెప్పలేక లోపలే అనుకుంటున్నారు. జగన్ కంటే విజయసాయిరెడ్డికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే విషయంపై అధిష్టానానికి నివేదికలు సైతం వెళుతున్నట్లు తెలుస్తోంది.